'శ్యామ్' అండ్ 'శ్యామ్'.. సేమ్ టు సేమ్!
on Dec 12, 2021

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్`.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన `రాధే శ్యామ్` మూడు వారాల వ్యవధిలో థియేటర్స్ లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ - సౌత్ ఇండియా మూవీగా నాని `శ్యామ్ సింగ రాయ్` డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల కానుండగా.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ - ఇండియా మూవీగా ప్రభాస్ `రాధే శ్యామ్` జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
Also read: 'పుష్ప' ప్రీరిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ డుమ్మా!
టైటిల్ లో `శ్యామ్` కామన్ ఫ్యాక్టర్ గా ఉన్న ఈ రెండు చిత్రాలకు సంబంధించి మరో కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే.. రెండు సినిమాలు కూడా 1970ల కాలం నాటి కథలతోనే తెరకెక్కాయి. `శ్యామ్ సింగ రాయ్`లో కొంత భాగం 1970లలో కలకత్తా నేపథ్యంలో సాగే ఎపిసోడ్స్ తో సాగగా.. `రాధే శ్యామ్` 1970ల సమయంలో ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రం. మరి.. సేమ్ టు సేమ్ పిరియడ్ లో సాగే `శ్యామ్` అండ్ `శ్యామ్`.. బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
Also read: 'శ్యామ్ సింగరాయ్'తో నాని ప్రభంజనం.. శాటిలైట్ రైట్స్ కి అన్ని కోట్లా!
కాగా, రాహుల్ సాంకృత్యాన్ రూపొందించిన `శ్యామ్ సింగ రాయ్`లో నానికి జంటగా సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటించగా.. `జిల్` రాధాకృష్ణ తీర్చిదిద్దిన `రాధే శ్యామ్`లో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



