రష్మిక ఇప్పుడైనా హ్యాట్రిక్ కొడుతుందా!
on Dec 13, 2021

చూసీ చూడంగానే తెలుగువారికి నచ్చేసిన అందం.. రష్మికా మందన్న. `ఛలో`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ కస్తూరి.. ఆపై `గీత గోవిందం`తో సంచలన విజయం నమోదు చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది. అయితే, ఆ తరువాత వచ్చిన `దేవదాస్`, `డియర్ కామ్రేడ్` నిరాశపరచగా.. `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` రూపంలో మళ్ళీ రెండు వరుస విజయాలను కైవసం చేసుకుంది రష్మిక. మధ్యలో అనువాదాలతో పలకరించినా.. ఆశించిన విజయాలను సొంతం చేసుకోలేకపోయింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
'రానా నాయుడు' కోసం వెంకీ మామ కొత్త అవతారం!
ఇదిలా ఉంటే.. స్వల్ప విరామం అనంతరం `పుష్ప - ద రైజ్`తో మరోసారి తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించబోతోంది రష్మిక. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ పాన్ - ఇండియా మూవీలో డీ-గ్లామర్ లుక్ లో ఎంటర్టైన్ చేయనుంది ఈ చందన సీమ సుందరి. మరి.. `ఛలో`, గీత గోవిందం` తరువాత హ్యాట్రిక్ మిస్ అయిన మిస్ మందన్న.. `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత వస్తున్న `పుష్ప - ద రైజ్`తోనూ హిట్ కొట్టి ఫస్ట్ హ్యాట్రిక్ ని తన ఖాతాలో జమ చేసుకుంటుందేమో చూడాలి.
సమంత 'ఊ అంటావా మావ' సాంగ్ పై కోర్టుకెళ్లిన పురుషుల సంఘం!
కాగా, అల్లు అర్జున్ హీరోగా నటించిన `పుష్ప - ద రైజ్` డిసెంబర్ 17న థియేటర్స్ లోకి రాబోతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



