జాతిరత్నాలు 'చిట్టి'తో తండ్రీకొడుకుల చిందులు!
on Dec 14, 2021

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా 'బంగార్రాజు'. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన లడ్డుండా, నా కోసం పాటలకు విశేషమైన స్పందన లభించింది. ఇక ఇప్పుడు 'పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్' అంటూ మూడో పాటతో అలరిచేందుకు సిద్ధమయ్యారు.
Also Read: అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్
‘బంగార్రాజు’ స్పెషల్ సాంగ్‌లో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా(చిట్టి) సందడి చేయనుంది. 'పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్' అంటూ తాజాగా ఈ సాంగ్ సంబంధించిన అప్డేట్ ను ఇస్తూ మేకర్స్ మ్యూజిక్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. "నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బంగార్రాజు.. మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోక బ్లౌజు" అంటూ ఈ సాంగ్ సాగనుంది. ఇక ఈ పోస్టర్ లో ఫరియా అబ్దుల్లాతో కలిసి అక్కినేని హీరోలు చిందిస్తూ కనిపిస్తున్నారు. నాగార్జున పంచెకట్టులో కనిపిస్తుండగా.. నాగ చైతన్య మోడ్రన్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఫరియా లంగావోణీతో అదరగొడుతోంది. ఈ సాంగ్ టీజర్ ని డిసెంబర్ 17 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
Also Read: ఘంటసాల బావ సుబ్బుగారు హైదరాబాద్ వచ్చారు!
గతంలో 'మనం' సినిమాలో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



