యాక్షన్ కింగ్ అర్జున్‌కు కరోనా!
on Dec 14, 2021

'యాక్షన్ కింగ్'గా అభిమానులు పిలుచుకొనే 59 సంవత్సరాల అర్జున్ ఎప్పుడూ మంచి ఫిట్‌నెస్‌తో ఆరోగ్యంగా కనిపిస్తుంటారు. అయితే ఆయన తాజాగా కొవిడ్-19 బారిన పడ్డారు. ఒక టీవీ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఇటీవల దానికి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ తర్వాత అందరితో పాటు అర్జున్ సైతం కొవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
Also read: సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు!
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆయన కొవిడ్ టెస్ట్ రిజల్ట్‌ను ప్రకటించారు. అవసరమైన అన్ని ప్రోటోకాల్స్ తీసుకుంటున్న ఈ సూపర్ ఫిట్ యాక్టర్, ఇంట్లోనే క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇటీవల తనకు సమీపంగా మెలగిన వాళ్లందరూ టెస్ట్ చేయించుకొని, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ప్రస్తుతం అర్జున్ బాగానే ఉన్నారు. అందరినీ సురక్షితంగా ఉండమని కోరిన ఆయన, మాస్క్ ధరించడం మర్చిపోవద్దని సూచించారు.
Also read: 'పుష్ప'ను సరిగా ప్రమోట్ చెయ్యమంటూ బన్నీకి జక్కన్న స్మూత్ వార్నింగ్!
కాగా, ఆయన సత్వరమే రికవర్ కావాలని కోరుతూ అభిమానులు సందేశాలు పంపుతున్నారు. కొద్ది రోజుల క్రితమే కమల్ హాసన్ సైతం అమెరికా నుంచి వచ్చి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. తర్వాత చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో చికిత్స తీసుకొని, పది రోజుల టైమ్‌లో కోలుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



