అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్
on Dec 14, 2021

మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ అసలు తగ్గట్లేదు. యంగ్ హీరోలే ఏడాదికో సినిమా చేయడానికి ఇబ్బంది పడుతుంటే.. ఆయన మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆయన నటించనున్న మరో మూవీ ప్రకటన అధికారికంగా వచ్చింది.
Also Read: కొరటాల బాటలో సుకుమార్ కూడా వెళతాడా?
యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరంజీవి సినిమా అంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ అధికారిక ప్రకటన వచ్చింది. 'ఛలో', 'భీష్మ' సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న వెంకీకి మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాను 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ మల్టీస్టారర్ ను నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించనుంది. #MegaStarWithMegaFan అంటూ ఓ వీడియో ద్వారా ఈ మూవీని ప్రకటించారు మేకర్స్. ఆ వీడియోలో వెంకీ మెగాస్టార్ భక్తుడిని అని చెప్పడం కనిపిస్తుంది. అలాగే గతంలో 'ఛలో' వేడుకకు హాజరైన మెగాస్టార్ 'నా అభిమాని డైరెక్టర్ అవ్వడం ఆనందంగా ఉంది' అంటూ వెంకీని ఉద్దేశించి చెప్పడం కనిపించింది. మరి యంగ్ హీరోలతో 'ఛలో', 'భీష్మ' సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్న వెంకీ.. తన అభిమాన హీరో మెగాస్టార్ తో ఎలాంటి సినిమా తీసి సంచలం సృష్టిస్తాడో చూడాలి.

Also Read: సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు!
మెగాస్టార్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ఫిబ్రవరి 4 న విడుదల కానుంది. అలాగే లూసిఫర్ రీమేక్ 'గాడ్ ఫాదర్', వేదాళం రీమేక్ 'భోళా శంకర్', బాబీ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. ఆ తరువాత వెంకీ కుడుముల ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



