'ఆదిపురుష్'తో దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్ అయిన ప్రభాస్!
on Dec 14, 2021

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ఒకదాని తర్వాత ఒకటిగా నాలుగు సినిమాలకు సంతకం చేశాడు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడమే కాకుండా, అతనికి అత్యధిక రెమ్యూనరేషన్ అందిస్తున్న సినిమాలు కూడా. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం రామాయణం ఆధారంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' సినిమాలో శ్రీరామునిగా నటిస్తున్నందుకు ప్రభాస్ అందుకున్న రెమ్యూనరేషన్ అక్షరాలా రూ. 150 కోట్లు!
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న బాలీవుడ్ ఖాన్ త్రయం - సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, అలాగే అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి టాప్ స్టార్స్‌ను ప్రభాస్ దాటేశాడు. ఆదిపురుష్‌కు ప్రభాస్ అందుకున్న రూ. 150 కోట్లతో పోలిస్తే, 'సుల్తాన్', 'టైగర్ జిందా హై' సినిమాలకు సల్మాన్ ఖాన్, 'బెల్ బాటమ్'కు అక్షయ్ కుమార్ అందుకున్న రెమ్యూనరేషన్ తక్కువ. మినిమమ్ గ్యారంటీ స్టార్ కావడంతో ప్రభాస్‌తో మెగా బడ్జెట్‌తో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు, ఫైనాన్షియర్లు మొగ్గు చూపుతున్నారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోన్న అతను సెలక్టివ్‌గా వాటిని ఎంచుకున్నాడు.
Also read: సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు!
రాజమౌళి తీసిన రెండు భాగాల 'బాహుబలి' మూవీ కోసం ఐదేళ్లు వెచ్చించిన దానికి ఫలితం దక్కి, పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా రూపుదాల్చాడు ప్రభాస్. ఆ ఫ్రాంచైజ్ తర్వాత అతను చేసిన 'సాహో' మూవీ సౌత్‌లో కంటే నార్త్‌లో బాగా ఆడటం, ఆ బెల్ట్‌లోనూ అతడికి విపరీతంగా ఫ్యాన్ బేస్ ఏర్పరడం విశేషం.
Also read: 'పుష్ప'ను సరిగా ప్రమోట్ చెయ్యమంటూ బన్నీకి జక్కన్న స్మూత్ వార్నింగ్!
'తానాజీ' ఫేమ్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తోన్న 'ఆదిపురుష్' మూవీతో అతను మరింతగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతాడని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ పౌరాణిక చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ కీలక పాత్రధారులు. ఈలోగా జనవరి 14న 'రాధే శ్యామ్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రభాస్. వీటితో పాటు 'సలార్', 'ప్రాజెక్ట్ కె', 'స్పిరిట్' సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



