కాజల్ కు బంపర్ ఆఫర్!
on Jul 9, 2016
"సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, దో లఫ్జోంకి కహానీ" వంటి వరుస డిజాస్టర్లతో కాజల్ కెరీర్ కష్టాల్లో పడింది. ఆ సినిమాల విడుదలకు ముందే సైన్ చేసిన తమిళ చిత్రం మరియు తేజ సినిమా మినహా కాజల్ చేతిలో మరో ప్రోజెక్ట్ లేకుండా అయిపోయింది. దాంతో కాజల్ కెరీర్ క్లైమాక్స్ కి వచ్చేసిందనుకోన్నారందరూ. అలా ఊహించినవారికి షాక్ ఇచ్చింది కాజల్ అగర్వాల్, తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ సరసన నటించే సువర్ణావకాశాన్ని సొంతం చేసుకొందట. "ఆరంభం, వీరమ్, వేదాలమ్" చిత్రాల తర్వాత అజిత్ నటించినున్న ఇంకా పేరు పెట్టని సినిమాలో కాజల్ ను కథానాయికగా ఎంపిక చేసుకొన్నట్లు తెలుస్తోంది. అనుష్కను దాదాపుగా ఫైనల్ చేసినప్పటికీ.. ఆమె "బాహుబలి 2" చిత్రం కోసం బల్క్ డేట్స్ ఇచ్చేసి ఉండడంతో.. అనుష్క స్థానంలో కాజల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మరి కాజల్ కు బ్యాక్ టు బ్యాక్ వచ్చిన మూడు ఫ్లాపుల అనంతరం లభించిన సక్సెస్ ను అమ్మడు ఎంతవరకూ సద్వినియోగం చేసుకొంటుందో చూడాలి!