బ్రేకింగ్.. హిందీ 'అల వైకుంఠపురములో' థియేటర్లలో రిలీజ్ కావట్లేదు!
on Jan 22, 2022

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించగా, త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ ఫిల్మ్ జనవరి 26న థియేటర్లలో విడుదలవుతుందని విన్నాం, చదివాం. బన్నీ లేటెస్ట్ ఫిల్మ్ 'పుష్ప' హిందీ డబ్బింగ్ ఫిల్మ్ నార్త్ బెల్ట్‌లో బ్లాక్‌బస్టర్ కావడంతో, 'అల వైకుంఠపురములో' డబ్బింగ్ ఫిల్మ్‌ను థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. అయితే అదే సినిమా కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా 'షెహ్‌జాదా' పేరుతో రీమేక్ అవుతుండటంతో, 'అల వైకుంఠపురములో' హిందీ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలనే ఆలోచనను విరమించుకొని, దాని బదులు శాటిలైట్ చానల్‌లో రిలీజ్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు.
Also read: ఓటీటీలోనూ 'అఖండ' జాతర
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ వెర్షన్ దిన్‌చాక్ టీవీ చానల్‌లో ఫిబ్రవరి 6న డైరెక్టుగా రిలీజవుతోంది. ఈ విషయాన్ని డబ్బింగ్ వెర్షన్ నిర్మాతలు ధ్రువీకరించారు. 'షెహ్‌జాదా' నిర్మాతలతో జరిగిన చర్చల అనంతరం 'అల వైకుంఠపురములో' హిందీ వెర్షన్ నిర్మాత, గోల్డ్‌మైన్స్ టెలీ ఫిలిమ్స్ అధినేత మనీష్ షా ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు. దాంతో 'షెహ్‌జాదా' నిర్మాతలు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
Also read: 'శ్రీమంతుడు' విలన్ రెండో పెళ్లి!
అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్, నివేదా పేతురాజ్, సముద్రకని, టబు, జయరామ్, సచిన్ ఖడేకర్, సునీల్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రాజేంద్రప్రసాద్ నటించిన 'అల వైకుంఠపురములో' 2020 జనవరి 12 విడుదలై ఆ ఏడాది టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



