4 కార్లు ఢీ.. ఒక కారులో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్!
on Jan 24, 2022
.webp)
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నాలుగు కార్లు ఒకదాన్నొకటి ఢీకొట్టిన ప్రమాదం నుంచి హాలీవుడ్ పాపులర్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ తప్పించుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన ఒక మహిళను హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. 'ప్రిడేటర్', 'టెర్మినేటర్' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించిన కండల వీరుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ కూడా అయిన ఆర్నాల్డ్ తన జీఎంసీ యుకాన్ కారును లాస్ ఏంజెల్స్‌లోని బ్రెంట్‌వుడ్ ప్రాంతంలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Also read: సల్మాన్ ఖాన్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన సమంత!
ఈ ఘటనలో ఒక మహిళ చేతికి గాయమైందనీ, ఆమెను హాస్పిటల్‌లో చేర్పించామనీ ఓ ప్రకటనలో లాస్ ఏంజెల్స్ పోలీసులు వెల్లడించారు. నాలుగు కార్లు ఢీ కొట్టిన ఘటనలో కార్లను డ్రైవ్ చేస్తున్న వారిలో ఎవరైనా ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ సేవించి ఉన్నారా అనే విషయం కానీ, ఈ ఘటనకు కారణం కానీ వారు వెల్లడించలేదు.
Also read: 'విక్రమ్ వేద'లో వేద ఫస్ట్ లుక్ ఇదే!
ఈ ప్రమాదంలో 74 సంవత్సరాల ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని ఆయన ప్రతినిధి డేనియల్ కెచెల్ తెలిపారు. చివరిసారిగా ఆయన టెర్మినేటర్: డార్క్ ఫేట్ (2019)లో కనిపించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



