సునీల్‌శెట్టి ఇంట్లో ఈ ఏడాది రెండు పెళ్లిళ్లు!
on Jan 21, 2022

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సునీల్‌శెట్టి ఇంట్లో ఈ ఏడాది రెండు పెళ్లిళ్లు జరగనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆయన కూతురు అథియ, కొడుకు అహాన్.. ఇద్దరూ తమ తమ ప్రేమల్ని 2022లో పెళ్లిగా మార్చుకోనున్నారు. క్రికెటర్, ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్‌డే ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌కు భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న కె.ఎల్. రాహుల్‌తో మూడేళ్ల నుంచీ అథియ రిలేషన్‌షిప్‌లో ఉంది.
Also read: డిప్రెషన్‌తో 20 కిలోల బరువు పెరిగిన సూపర్‌స్టార్ కుమార్తె.. ఫొటోలు వైరల్!
అలాగే అహాన్‌శెట్టి కూడా దాదాపు దశాబ్ద కాలం నుంచీ తానియా ష్రాఫ్ అనే యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇప్పుడు అటు అథియ, ఇటు అహాన్ తమ అనుబంధాలను అధికారికం చేసుకోవాలనే నిశ్చయంతో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఆ కుటుంబానికి క్లోజ్ ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం 2022లో వారు తమ లవర్స్‌తో కలిసి ఏడడుగులు నడవనున్నారు.
Also read: సల్మాన్ ఖాన్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన సమంత!
"అథియా, రాహుల్ వెడ్డింగ్ కచ్చితంగా 2022లో జరగనున్నది. వారి వివాహానికి ఇద్దరి పేరెంట్స్ ఆశీస్సులు ఉన్నాయి. అహాన్ విషయానికి వస్తే, అతను కూడా తానియా ష్రాఫ్‌తో రిలేషన్‌షిప్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాడు. త్వరలోనే.. అదీ 2022లోనే పెళ్లి చేసుకోవాలని అతను ఆశిస్తున్నాడు" అని ఆ క్లోజ్ ఫ్రెండ్ తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



