Home

»

Latest News

ఓటీటీలోనూ 'అఖండ' జాత‌ర‌

Jan 22, 2022

 

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్ చేయ‌గా, బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేసిన 'అఖండ' సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంచ‌నాల‌ను మించి వ‌సూళ్ల‌ను సాధించ‌డ‌మే కాకుండా, థియేట‌ర్ల‌లో 50 రోజుల‌ను దాటి ఇంకా ప్ర‌ద‌ర్శింప‌బడుతోంది. గురువారం నుంచి ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌పామ్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కొవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్ల‌కు భారీ సంఖ్య‌లో ప్రేక్ష‌కుల్ని ర‌ప్పించిన సినిమాగా 'అఖండ' పేరు తెచ్చుకుంది. నిజానికి కుదేలైవున్న టాలీవుడ్‌కు ఓ టానిక్‌లా వ‌చ్చింది 'అఖండ‌'. 

బాల‌య్య ద్విపాత్రాభిన‌యం, బోయ‌పాటి డైరెక్ష‌న్‌, త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ క‌లిసి 'అఖండ‌'ను మెమ‌ర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌గా మార్చాయి. 2021లో విడుద‌లైన టాప్ ఫిలిమ్స్‌లో ఒక‌టిగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందుతున్న అఖండ బాల‌కృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా, రూ. 75 కోట్లకు పైగా షేర్‌ వ‌సూలు చేసిన సినిమాగా కూడా నిలిచింది. 

Also read: టాలీవుడ్ స్టార్స్ @ బ్యాక్ టు బ్యాక్ హిట్స్!

అలాంటి ఆ సినిమాను ఇప్పుడు ఓటీటీలోనూ జ‌నం అమితాస‌క్తితో చూస్తున్నార‌ని తెలుస్తోంది. థియేట‌ర్ల‌లో ఇప్ప‌టికే అఖండ‌ను చూసిన‌వాళ్లు మ‌రోసారి ఓటీటీ వేదిక‌పై చూస్తుండ‌గా, ఇంత‌దాకా థియేట‌ర్ల‌లో చూడ్డానికి వీలుప‌డ‌ని వాళ్లు డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో దాన్ని చూసి, ఇప్ప‌టిదాకా దీన్ని చూడ‌కుండా ఎందుకు మిస్స‌య్యామా అని ఫీల‌వుతున్నారు. తొలిరోజే ఈ మూవీని చూసిన‌వాళ్ల సంఖ్య మిలియ‌న్ దాటింద‌ని స‌మాచారం.

Also read: బాల‌య్య‌-గోపీచంద్ సినిమాలో కీల‌క పాత్ర‌లో అజ‌య్ ఘోష్‌!

కాగా, త‌మ వేదిక‌పై 'అఖండ‌'ను చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు ఆ ఓటీటీ దిగ్గ‌జం ఒక ఆస‌క్తిక‌ర‌మైన ఆఫ‌ర్‌ను అంద‌జేస్తోంది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో సినిమా చూసిన‌వాళ్ల‌కు బాల‌కృష్ణ‌ను వ్య‌క్తిగ‌తంగా క‌లుసుకొనే అవ‌కాశాన్ని కూడా క‌ల్పిస్తోంది. ఇంకెందుకు ఆల‌స్యం, ఓటీటీపై 'అఖండ‌'ను చూసేయండి, మీ అభిమాన హీరో అయిన బాల‌య్య‌ను క‌లుసుకునే ఛాన్స్ కొట్టేయండి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com