మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ జనన మరణాలు సృష్టి నియమాలు. విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. లేకపోతే, మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు.
Sep 18, 2024
పందొమ్మిదివందల ఎనభయ్యవ సంవత్సరం. ‘విపుల:చతుర’కి సబ్ ఎడిటర్ గా ఉన్న రోజులు. ఆఫీసులో లంచ్ అయిన తర్వాత కొలీగ్సంతా కలసి, కెసిపి గెస్ట్ హౌస్ దగ్గరి పాన్ షాప్ కి వెళ్లేవాళ్లం. పాన్ బిగించి, అక్కడ సిగరెట్ తాగేవాళ్లం.
Sep 16, 2024
భయపడేవాడిని లోకం మరింత భయపెడుతుంది. భయంతో కుంచించుకుపోయిన మనిషి జీవితంలో ఏదీ సాధించలేడు. భయానికి విరుగుడు సాహసం. ధైర్య సాహసాలున్న చోట అపజయానికి చోటుండదు. భయానికి ఎదురొడ్డి నిలబడటమే విజయానికి తొలి సోపానం.
Sep 10, 2024
ఒకానొక అడవిలో ఓ మర్రిచెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తోంది. అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తోంది.. ఒక వేటగాడు రోజూ రాత్రి ఆ చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ ఓ వలను పరచి వెళ్లేవాడు. రాత్రివేళ అందులో ఏవో ఒక జంతువులు చిక్కుకుంటాయి కనుక ఉదయమే వచ్చి వలలో చిక్కిన వాటిని చక్కగా తీసుకుని పోయేవాడు.
Sep 9, 2024
ఏం రాస్తున్నామన్నది తర్వాత శర్మగారూ! ముందు రాయడం ప్రారంభించాలి. కుళాయి తిప్పితేనే గదా నీరొచ్చేది అన్నారు డి. కామేశ్వరి ఓసారి. ఆసారి నాకు చాలా కబుర్లు చెప్పారామె. మీరు కథలపోటీలు నిర్వహిస్తారుకదా! ఆ పోటీలకు కథ రాసినప్పుడు మీరు పేర్కొన్న ఏ నియమనిబంధనలూ నేను పాటించను. కథ రాస్తానంతే! మీకు నచ్చితే బహుమతి ఇస్తారు. ప్రచురిస్తారు. లేదంటే...తిప్పి పంపుతారు.
Sep 5, 2024
కృతయుగంలో సుప్రతీకుడు అనే రాజు ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. వారికి ఎప్పటికీ సంతానం కలగకపోవడంతో సుప్రతీకుడు చిత్రకూట పర్వతంపై ఆశ్రమం ఏర్పరచుకున్న ఆత్రేయ మహర్షిని ఆశ్రయించి, ఆయన అనుగ్రహంతో దుర్జయుడనే పుత్రుణ్ణి పొందాడు. దుర్జయుడు అమిత బలవంతుడు. అపార సేనాసంపత్తితో దిగ్విజయయాత్రకు వెళ్లి, సమస్త భూమండలాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.
Sep 4, 2024
పార్వతీపురంలో, మా ఇంటి ఎదురుగా రచయిత పంతులజోగారావుగారు ఉండేవారు. ఆనాటికే ఆయన పేరున్న రచయిత. నేనింకా రచనలో ఓనమాలు ఇసుకలో దిద్దుతున్న రోజులవి. ఒకనాడు ఆయన్ని పరిచయంచేసుకుని, కొత్తగా నేను రాసిన కవిత ఒకటి వినిపించాను. విని, నవ్వారాయన. ‘‘ఏదైనా వ్రాయడానికి ముందు చదవడం అలవాటుచేసుకుంటే బాగుంటుంది. నువ్వేం చదివావు?’’ అడిగారు. ఏమీ చదవలేదన్నాను.
Aug 31, 2024
పలుకుబడులు నుడికారాలకు పుట్టిల్లు తెలుగు భాష




















