వినవయ్య మానవ..!!

వినవయ్య మానవ..!!   మనసు విప్పి..కళ్ళు తెరిచి..విను..విను..!! అరువు తెచ్చి దున్నెను..!! కరువు వచ్చి కాటేయును..!! రుణం తెచ్చి పోలంలో రణం చేసి..!! క్షణ క్షణం దిగుబడికై ఎదురుచూస్తే..!! దింపెడు కల్లం ఆశలే అయిపొతున్నాయి..!!   మరణాలే శరణాలు అవుతున్నాయి..!! ఆంధ్ర రైతు వడ్డి పెరిగే..!! తెలంగాణ రైతు నడ్డి విరిగే..!! ప్రపంచానికి పొట్ట నింపే రైతుకు..!! పావు గంట కూడా ఉండదు కరెంటు..!! రుణం చెల్లించకుంటే రైతుకు తప్పదు వారెంటు..!! దేశాన్ని దోచుకోని పరదేశంలో..!! నివశించే వారిని ఏమి చేయలేవు ఈ ప్రభుత్వాలు..!! దేశంలో ఉన్న ప్రజల పొట్ట నింపుటకై..!! చేసిన రుణాలు చెల్లించమంటే  గగ్గొలు పెడతాయి..!! వినవయ్య ఓ మానవ ..!! రాబోయే రోజులు బువ్వ దొరకక..!! ఒకరికి ఒకరం పీక్కు తింటాము..!! ఇప్పటికే కొన్ని దేశలలో మోదలైయినది..!! అయినా మారకపోతే నీ దేశ పరిస్థితి..!! నీ పరిస్థితి కూడా అంతే..!!   ---జాని.తక్కెడశిల 

ఒలికిమిట్టలో ఒట్టు

ఒలికిమిట్టలో ఒట్టు   ఓ ప్రియా నీ కరతలము నా కరముతో బంధించి  ఒలికిమిట్టలో ఉన్న క్రతుధ్వంసి సాక్షిగా చెప్తున్న ...!!!   నీలో నేనే..!! నాలో నీవే..!! నీకు నేనే..!! నాకు నీవే..!! నా డెందము నీదే..!! నీ సత్వము నాదే..!! నా స్వాంత స్వరము నీకే..!! నీ తురంగ స్వరాగాలు నా కొరకే ..!! నీ కక్కసములో నీడనై..!! నీ కౌతుకములో తోడునై..!!   నీ విజితిలో కారకుడినై..!! నీ హ్వాలములో నేతోడై..!!   నీ హస్తము నే వదలను ఓ అఖిలనేత్రి ..!! నీవే నా జీవనం..!! నీవే నా మననం ..!! నీవే నా గమనం..!! నీవే నా ఆశయ గగనం ..!! నీవే నా ప్రాణం..!! నీవే నా అపానం..!! నీవె నా వ్యానం..!! నీవే నా ఉదానం..!! నీవే నా సమానం..!! నా ఆది నీవే..!! నా అంతం నీవే..!! నా అనంతం నీవే..!! నీవే...నీవే నా అంతట నీవే..!! నా ఇహ యందు నీవే..!! నా పర యందు నీవే..!! నేనంత్త నీవే..!! నీవెంత్త నేనే..!! నంతాయు నీవే..!! నా మతిలో అలోచన..!! నా లోచనాల మధుర కలా సులోచన..!! నా సుమదిలో నీవే కదా ఓ లలన ..!! నిన్నే దాచను నా హృదయ మందిరాన ..!! ఈ జన్మలోనే కాదు..!! మరు జన్మలో అయినా..!! ఆ మరో జన్మలో అయినా..!! జన్మ జన్మల నేనే నీ ప్రాణా సఖుడిని ఓ అఖిలం..!! -జాని.తక్కెడశిల  

స్నేహమా...

  స్నేహమా... ఒక్కో సారి గుర్తొస్తుంది అసలు మౌనానికి దాహమెంతని? కన్నీటిని తాగి బతికేదే మౌనం అన్నంతగా అర్దం నిలబడిపోయింది, నీ తలపుల వేడిలో మార్చుకోవాలని మొహమాటమెందుకో ఈపిచ్చి మనసుకి. నిన్ను మరచిన క్షణాలెక్కడని వెతికితే పెదాలు వెక్కిరించి మరీ నవ్వుతున్నాయి. రాలు పూల తేనియకై అని రాసిన కవి మనసుకి మోకరిల్లాలనే వినమ్రత ఒక వైపు అంతకంటే భావుకతను గుండెల్లో దాచాననే భావన ఒకవైపు! ధృవాలన్నీ కరిగిపోయి, విశ్వమంతా అరిగిపోయినట్లుగా శూన్యం ఆవరిస్తుంది. నీ చెలిమి చెలమల్లో విరహపు చేయి ముంచగానే..! అంత మాత్రన భావాన్ని అంతం చేసుకున్నానంటే పొరపాటే. సున్నితపు పొలికేక ఏదో నిన్ను పిలుస్తూ విశ్వాంతరాలను దాటి వెళ్లలేదంటావా? నువ్వే చెప్పు.. నీకై నే చేజార్చుకున్న నా జీవితానికి అర్దవంతమైన సమాధానం! ఆ పలుకుల కోసం కలత నిదురలో ఎన్ని కలవరింతలో,కారు మబ్బుల మధ్యనున్న చందమామని అడుగుదాం రా మరి.పాలపుంతల ను చూసిన ఏకాకి మదికి ఏమారపాటులోనైన ఒక ఊ కొడతావని ఈ అవని నుంచి వేచి చూస్తున్నా... కారిపోయిన కన్నీరు తిరిగి వస్తే బావుండు, మరోసారి ఏడుస్తా... సమాధానం కోసం వేచి చూస్తుంది సమాధి చేయబడని నా మనోః శవం. నీకు ఈలేఖ అందదని తెలిసినా కాస్త ఊరట నా మదికి ఏదో భావాన్ని కాస్త బయటపెట్టానని! ఉంటా నేస్తం!! ---- Raghu Alla