నే చేరాల్సిన గమ్యం
posted on Nov 10, 2016
నే చేరాల్సిన గమ్యం
గమ్యమేదో తెలియదు కానీ..
'నీకై' నడిచిన ఆడుగులు
ఇంకా ఆగలేదు,
నీతో నడిచినవి ఆగాయంతే..!
తేడా ఎంతుందన్నది,
నీలోని నాకే తెలుసు.
అసలు నిన్ను నువ్వు చూసుకుంటావు,
బాగానే ఉంది...!
ఆ 'నేను' కనపడలేదంటే అబద్దమేనేమో..!
కలలెంత పచ్చిగా ఉంటాయో,
ఎండుటాకులా రాలుతున్న
నా మది అణువులనడుగు..!
రోజుకో కొత్తదనాన్ని
నీ పాత జ్ఞాపకాల్లోనే గమనిస్తున్నా..
నమ్ముతావా దూరమెంత దగ్గరని?
నా 'నీడ'నడిగితే,
మాయమైన నీ తోడుని
గుర్తెరుగుతుంది...!
ఇదేనేమో ,
నే చేరాల్సిన గమ్యం మరి..
దానికై వేస్తున్న
అజ్ఞాతపు అడుగుల సాక్షిగా...!!!
--Raghu Alla