శేషం 'సున్నా'
posted on Sep 21, 2016
శేషం 'సున్నా'
కొన్ని నవ్వుల్ని పోగేసుకుందామని
వెనకకు చూస్తే,
అవి నీతో ముడిపడి ఉన్నప్పుడు
నీవు లేని ఈ క్షణాన్ని,
ఆ నవ్వులతో తీసివేస్తే..
చేయని వియోగపు భాగాహారానికి
శేషం 'సున్నా' నే వచ్చింది!
సున్నా అనే శూన్యమే మిగిలింది!!
శూన్యంలోని నన్ను వెతుక్కోడానికి సైతం
నీ తోడు అవసరమేనని, తేల్చేసావ్!
తేల్చేసావ్!!!
- Raghu Alla