గెలుపంటే ఏమిటో తెలుసా అసలు నీకు?
posted on Sep 10, 2016
నీకోసం నే ఓడి
నీ గెలుపును నీకివ్వడమే అని
నాకు తెల్సినంత ఓటమి సంతోషాన్ని
నీ ఒడిలో పంచుకున్నప్పుడు,
కాసింత గర్వంతో నీ పెదాల నవ్వుని
నా కళ్లతో పట్టుకున్నా చూడు...
అక్కడే ఆగిపోయిన ఆ క్షణం లో
దేహాలిప్పుడు అప్రస్తుతమయ్యి
ఆత్మానంద అనుభూతులలో తేలి ఆడటాన్ని
ఏ గెలుపోటములు లెక్క కడతాయి?
ఆ బుంగమూతి లెక్కలిప్పుడు సరైనట్లేనా..
నాకు నువ్వు గెలిచినట్లేనా!!!!
---- Raghu Alla