RELATED EVENTS
EVENTS
డల్లాస్ లో టాంటెక్స్ & తానా ఆధ్వర్యంలో ఘనంగా కబడ్డీ, టెన్నికాయట్, త్రోబాల్ పొటీలు

 

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాంటెక్స్) మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సంయుక్తంగా కబడ్డీ, టెన్నికాయట్, త్రోబాల్ పొటీలను టాంటెక్స్ స్పోర్ట్స్ ప్రతినిధి వెంకట్ దండ, తానా స్పోర్ట్స్ ప్రతినిధి సాయి లింగ మరియు వారి బృంద కార్యనిర్వహణలో ఎంతో విజయవంతంగా జరిపించారు. చాలా మంది తెలుగు కుటుంబాలు వారి పిల్లలతో సహా ఉత్సాహముతో పాల్గొన్నారు.

 

పచ్చిక బయలు, నీటి కొలనులు మరియు అన్ని హంగులు కలిగినటువంటి  కొపెల్ నగరములోని ఆండ్రు బ్రౌన్ పార్క్ ఈ అటలపొటీలకు ఆథిద్యాన్నిచ్చింది. టాంటెక్స్ అద్యక్షులు విజయ మోహన్ కాకర్ల క్రీడాకారులకు స్వాగతము పలికి, మన గ్రామీణ క్రీడలలో పాల్గొనేందుకు వచ్చిన అందరిని అభినందించారు. ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు పాల్గొనడము ఈపొటీలకు వన్నె తెచ్చిందన్నారు.

 


తానా ప్రాంతీయ ప్రతినిధి రాజేష్ అడుసుమిల్లి మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి తోడ్పడతాయన్నారు. తెలుగు వారి అభ్యున్నతికి తానా ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందన్నారు. క్రీడాకారులు తమ చిన్ననాటి అనుభూతులను గుర్తుచేసుకుంటూ ఎంతో ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు.



కబడ్డీ పోటీలో టాంటెక్స్ కప్ ను భీమసేన జట్టు, తానా కప్ ను ఆష్టదిగ్గజాలు జట్టు గెల్చుకున్నాయి. టెన్నికాయట్ పోటీలో టాంటెక్స్ కప్ ను కపెల్ కిలాడి జట్టు, తానా కప్ ను కపెల్ కౌగర్ల్ జట్టు గెల్చుకున్నాయి. త్రోబాల్ పోటీలో టాంటెక్స్ కప్ ను మాధవి దివి మరియు నితీష కర్నాటి, తానా కప్ ను జాన్సి చామకూర మరియు శాంతి గున్న గెల్చుకున్నారు.

 



టాంటెక్స్ మరియు తానా సభ్యులు విజేతలను అభినందించారు. ఈ ఆటల పొటీలను ఘనంగా నిర్వహించిన స్వచ్చంద కార్యకర్తల సేవలను కొనియాడారు. ప్రసారమాధ్యమాలు దేసిప్లాజా, టీవీ9, టీవీ5, 6టీవీ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయము అల్పాహారము సమకూర్చిన సరిగమ రెస్తారంట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;