RELATED EVENTS
EVENTS
58th Nela Nela Telugu Vennela

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్యవేదిక సమర్పించిన ) నెల నెలా తెలగు వెన్నెల "58 వ సదస్సు మే, 19, 2012 శనివారం ఓరీస్ ఇండియన్ రెస్టారెంటులో, సంయుక్త కార్యదర్శి మరియు సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగినది. డాలస్ ప్రాంత భాషాభిమానులు, సాహితీ ప్రియులు అత్యంత ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ముందుగా స్వీయరచనలలో భాగముగా పద్యకవులైన డా. గన్నవరపు నరసింహమూర్తి తాము ఇటీవల పూర్తిచేసిన సమస్యాపూరణలను సభికులకు వినిపించారు. "కథలు మనకు ఎందుకు నచ్చుతాయి" అనే విషయము మీద కన్నెగంటి చంద్ర చేసిన ప్రసంగము అందరిని విశేషముగా ఆకట్టుకున్నది. ఇటీవల మరణించిన ప్రముఖ ప్రజాకవి, ప్రజాఉద్యమ నాయకుడు, భావుకుడు, శివసాగర్ పేరుతో విశేష ఖ్యాతినార్జించిన సత్యమూర్తి గురించి శ్రీ సాజీ గోపాల్ ప్రసంగించారు. శివసాగర్ తనచుట్టూ ఉన్న సమాజములోని అసమానతలను అధ్యయనముచేసి దానికి పరిష్కారమార్గపు దిశగా ప్రజాఉద్యమాలను నడిపించారని సభికులకు వివరించారు. 

 

Vemana kavita chandrika dallas, north texas telugu association nela nela telugu vennela, tantex sahitya vedika nela nela telugu vennala, nela nela telugu vennela 58th may 19th, 2012,  dallas 58tth nela nela telugu vennela, telugu nri news

 

పిమ్మట సాహిత్య వేదిక సభ్యుడు శ్రీ మద్దుకూరి విజయ చంద్రహాస్  వెండి తెరవేదిక కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన శ్రీమతి సుధామయి గారిని సభాసదులకు పరిచయము చేసారు. ‘వ్యాఖ్యాన శిరోమణి’, ‘ఉత్తమ వ్యాఖ్యాత’ తదితర బిరుదులు గల సుధామయి తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తముగా ఎన్నో కార్యక్రమాలలో శ్రోతలను మెప్పించిన విషయము తెలియపరచారు. వెండితెర రారాజు విశ్వవిఖ్యాత నటరత్న పద్మశ్రీ నందమూరి తారాకరామారావుగారి జయంతి సందర్భంగా ఆయన సినీజీవిత విశేషాలను వీడియోల ద్వారా సుధామయి వివరించి సభకు విచ్చేసిన అందరిని విశేషముగా అలరించారు.  తదుపరి టాంటెక్స్ కార్యదర్శి మరియు సాహిత్య వేదిక సభ్యుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి ఈ సదస్సు ముఖ్యఅతిథి శ్రీమతి రంగరాజు రమ గారిని సభకు పరిచయము చేసారు. వీరు పద్మావతీ డిగ్రీ కళాశాలలో ఇరవైఐదు సంవత్సరాలకుపైగా అధ్యాపకురాలిగా సేవలందించారు.

 

Vemana kavita chandrika dallas, north texas telugu association nela nela telugu vennela, tantex sahitya vedika nela nela telugu vennala, nela nela telugu vennela 58th may 19th, 2012,  dallas 58tth nela nela telugu vennela, telugu nri news

 

"వేమన కవితా దృక్పదం మరియు మానవతా వాదము" అనే అంశముపై ముఖ్యఅతిథి ప్రసంగము ఆద్యంతము ఆసక్తికరముగానూ, ఆలోచనాత్మకముగానూ సాగినది. వేమన యోగిగా మారటము వెనుక ప్రాచుర్యములో ఉన్న కథలను సభాసదులకు వివరించారు. ఆనాడు సమాజములో ఉన్న మూఢవిశ్వాసాల మీద అసమానతలమీద తన ఆటవెలది బాణాలను సూటిగా సంధించిన ప్రజాకవి వేమన అని ఆమె అభివర్ణించారు. లోభత్వము, మానవతావాదము, మూఢవిశ్వాసాలు, కులమతాల లాంటి అనేక అంశాలపై అలతి అలతి పదాలతో అద్భుతమైన నీతి పద్యాలను రాసిన వేమన సూర్యచంద్రులున్నంత వరకూ వెలుగులు చిమ్మే అసలు సిసలు కవి అని పేర్కొన్నారు. 

 

టాంటెక్స్ అధ్యక్షులు శ్రీమతి గీత దమ్మన్న, పాలక మండలి అధ్యక్షులు డా.ఆళ్ళ శ్రీనివాస రెడ్డి ఈ సదస్సులో ప్రసంగం గావించిన అతిథులు శ్రీమతి సుధామయి గారిని మరియు శ్రీమతి రంగరాజు రమ గారిని దుశ్శాలువలతో సత్కరించారు. టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు మండువ సురేష్ , శ్రీమతి సుధామయి గారికి జ్ఞాపికను సమర్పించారు. సాహిత్య వేదిక సభ్యులు శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శ్రీ మద్దుకూరి విజయ చంద్రహాస్ , శ్రీ మల్లవరపు అనంత్, డా. జువ్వాడి రమణ, డా.ఊరిమిండి నరసింహా రెడ్డి, శ్రీ కాజ సురేష్, శ్రీ బిల్లా ప్రవీణ్, శ్రీ నసీం షేక్ లు ముఖ్య అతిథి శ్రీమతి రంగరాజు రమ గారికి జ్ఞాపికను సమర్పించడంతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కార్య నిర్వాహక సభ్యులు వనం జ్యోతి, వీర్నపు చినసత్యం మరియు చామకూర బాల్కి హాజరయ్యారు.

 

Vemana kavita chandrika dallas, north texas telugu association nela nela telugu vennela, tantex sahitya vedika nela nela telugu vennala, nela nela telugu vennela 58th may 19th, 2012,  dallas 58tth nela nela telugu vennela, telugu nri news

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;