RELATED EVENTS
EVENTS
52nd Nela Nela Telugu Vennela

టాంటెక్స్ సాహిత్య వేదికపై ఎఱ్ఱన కవితా ప్రశస్తి: 52 మాసాలుగా నిర్విరామంగా నడుస్తున్న సదస్సు డాల్లస్, టెక్సస్ , నవంబర్ 20, 2011,

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 52 వ సదస్సు ఆదివారం, నవంబర్ 20 వ తేదీ స్థానిక రుచి పాలస్, కేరొల్టన్ లో ఊరిమిండి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగింది. డాల్లస్ ప్రాంత భాషాభిమానులు, సాహితీ ప్రియులు అత్యంత ఆసక్తి తో ఈ సమావేశానికి విచ్చేసారు.

త్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక  సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 52 వ సదస్సు

ముందుగా వెండితెర వేదిక శీర్షికన జువ్వాడి రమణ, 1970, 1980 దశకాల్లో ఇతర భాషల్లోంచి, ముఖ్యంగా కన్నడం లోనుంచి తెలుగు లోకి వచ్చిన సినిమాపాటల మూలాలను చూపించి, తెలుగులో వాటిని గుర్తించమని సభికులకు సవాల్ విసిరారు. ఆ తెలుగు పాటల పల్లవులను మద్దుకూరి చంద్రహాస్ పాడి వినిపించారు. వినూత్నమైన ఈ ప్రదర్శన అందరినీ అలరించింది. నన్నయ భారతంలోనుంచి కొన్ని పద్యాలను మచ్చుకు వినిపించి రమణ తన ప్రసంగాన్ని ముగించారు.

తరువాత ఊరిమిండి నరసింహారెడ్డి శ్రీశ్రీ కి పాఠకుల ప్రశ్నలు వాటికి శ్రీశ్రీ జవాబులు వినిపించారు. సభలోనివారిని రెండు జట్లు గా విభజించి ఒక క్విజ్ నిర్వహించారు. దీనిలో సభాసదులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ గన్నవరపు వరాహ నరసింహమూర్తిని కాజా సురేశ్ సభకు పరిచయం చేస్తూ వృత్తి రీత్యా వైద్యుడు, ప్రవృత్తి రీత్యా భాషాసాహిత్యాభిమాని, పద్య రచయిత, గ్రంధకర్త గా నరసింహమూర్తిగారిని ప్రశంసించారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక  సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 52 వ సదస్సు  ఆదివారం,

తరువాత ‘ఎఱ్ఱన కవితాప్రశస్తి’ అనే అంశం పై ముఖ్య అతిథి ప్రసంగం కొనసాగింది. ఎఱ్ఱన పాకనాటి ప్రాంతానికి చెందిన గుడ్లూరు గ్రామానికి చెందినవాడని, అది నేటి ప్రకాశం జిల్లా లో ఉందని, మహాభారత రచనతో బాటు ఆయన హరివంశం, నృసింహపురాణం, రామయణంకూడా రచించారని చెప్పారు. అరణ్యపర్వ శేషాన్ని పూరిస్తున్నప్పుడు ఆయన నన్నయ శైలి తో ప్రారంభించి, తిక్కన శైలితో ముగించారని, ఈ రెంటికీ మధ్యభాగంలో ఎఱ్ఱన అసలు శైలి మనకు కనబడుతుందని, నన్నయ తిక్కన శైలులతోపాటు, పురాణ, కావ్య, ఇతిహాస శైలులు మొదలైన బహురూప శైలీ విన్యాసం అయన స్వంతమని అన్నారు.

ఎఱ్ఱన భారతంలోని కర్ణుని జన్మవృత్తాంతం, కుంతీవిలాపం, ఘోషయాత్ర, సైంధవుని గర్వభంగం, సావిత్రీ సత్యవంతుల కధలో ప్రకృతివర్ణన, రామయణ వృత్తాంతం లో మధువనం పాడుచేయడం మొదలైన మధురఘట్టాల్లోనుంచి అనేక పద్యాలను ఉదహరించారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక  సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 52 వ సదస్సు  ఆదివారం,

తదనంతరం సాహిత్య వేదిక కార్యవర్గసభ్యులు జువ్వాడి రమణ, మద్దుకూరి చంద్రహాస్, కాజా సురేశ్, ఊరిమిండి నరసింహారెడ్డి, అలాగే ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గసభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, బొడ్డు శేషారావు, పొన్నూరు సుబ్బారావు అందరూ కలసి జ్ఞాపికతో గన్నవరపు నరసింహమూర్తి గారిని సత్కరించడంతో సభముగిసింది. ప్రధాన వక్త డా. మూర్తి గారికి, విచ్చేసిన ప్రేక్షకులకు మరియు రుచి ప్యాలెస్ యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలియజేయడంతో 52వ సదస్సు కు తెరపడింది

TeluguOne For Your Business
About TeluguOne
;