RELATED EVENTS
EVENTS
TANTEX Fifth Anniversary Celebrations

టాంటెక్స్ సాహిత్యవేదికపై తెలుగు భాషకు పట్టాభిషేకం! పంచకావ్యంతో ఘనంగా పంచమ వార్షికోత్సవ సంబరాలు

tantex fifth anniversary, tantex celebrations dallas, tantex celebrations dallas fortworth, tantex telugu nsahithya vedika, tantex garikapati avadhanam, tantex telugu language celebrations, tantex cultural programs

జులై 14, 2012, డాల్లస్ ఫోర్ట్ వర్త్
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్( ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య వేదిక సమర్పించిన "నెలనెలా తెలుగు వెన్నెల" పంచమ వార్షికోత్సవ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. డాల్లస్ ప్రాంతీయ తెలుగు భాషాభి మానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో  స్థానిక ట్రినిటీ హైస్కూల్ లో సమావేశమయ్యారు. చిన్నారులు ఆలాపించిన "మాతెలుగు తల్లికి మల్లెపూదండ"  ప్రార్థనా గీతం అనంతరం జ్యోతి ప్రజ్వలన తో టాంటెక్స్ సంయుక్త కార్యదర్శి మరియు  తెలుగు  సాహిత్య వేదిక  సమన్వయకర్త శ్రీ జొన్నలగడ్డ సుబ్రమణ్యం అధ్యక్షతన పంచమ వార్షికోత్సవ  సంబరాలు ప్రారంభమయ్యాయి.

tantex fifth anniversary, tantex celebrations dallas, tantex celebrations dallas fortworth, tantex telugu nsahithya vedika, tantex garikapati avadhanam, tantex telugu language celebrations, tantex cultural programs

ఈ సంబరాలలో సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు శ్రీ మల్లవరపు అనంత్, డాక్టర్. జువ్వాడి రమణ, శ్రీ మద్దుకూరి విజయ చంద్రహాస్, శ్రీ కాజ సురేష్, శ్రీ బిల్లా ప్రవీణ్, డా. ఊరిమిండి నరసింహరెడ్డి చురుకుగా పాల్గొన్నారు.

tantex fifth anniversary, tantex celebrations dallas, tantex celebrations dallas fortworth, tantex telugu nsahithya vedika, tantex garikapati avadhanam, tantex telugu language celebrations, tantex cultural programs

టాంటెక్స్ అధ్యక్షులు  శ్రీమతి గీత దమ్మన్న తమ సందేశంలో " భాష మరియు సాహిత్య పరిజ్ఞానం మనిషి వ్యక్తిత్వాన్ని ఇనుమడింప చేస్తుంది. జీవితాన్ని వివిధ కోణాలలో అర్ధం చేసుకోవడానికి తోడ్పడుతుంది. మానవుడిగా మనకున్న విలువైన సమయంలో మంచి గ్రంధ పఠనం ద్వారా ఇటు వ్యక్తిత్వ వికాసానికి అటు సామాజిక పరివర్తనకు తోడ్పడే అవకాశం ఉంటుంది" అన్నారు. శ్రీ జొన్నలగడ్డ సుబ్రమణ్యం తమ సందేశంలో గత ఐదు సంవత్సర కాలంలో నిర్విరామంగా ఉత్తమ సాహితీ వేత్తల సమక్షంలో సాహిత్య వేదిక సాధించిన విజయాలు  
తెలుగు భాషాభివృద్ధి ప్రాముఖ్యత, అందుకు చేయూత నిస్తున్న అధ్యాపకుల గుర్తింపు, పోషకదాతల ప్రోద్బలం తదితర వివరాలను సభికులకు తెలియజేసారు.

tantex fifth anniversary, tantex celebrations dallas, tantex celebrations dallas fortworth, tantex telugu nsahithya vedika, tantex garikapati avadhanam, tantex telugu language celebrations, tantex cultural programs

పంచమ వార్షికోత్సవం  సందర్భంగా సిలికానాంధ్ర వారి మనబడి సహకారంతో నిర్వహించిన "తెలుగు మాట్లాట" పోటీలలో విజేతలైన బాలబాలికలకు  టాంటెక్స్  వేదికపై పురస్కార పత్రాలను, బహుమతులను  అందజేసారు. పెద్దలకు వేదికపై నిర్వహించిన  "తెలుగులో ఒక నిమిషం " తుదిపోటీలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. 

tantex fifth anniversary, tantex celebrations dallas, tantex celebrations dallas fortworth, tantex telugu nsahithya vedika, tantex garikapati avadhanam, tantex telugu language celebrations, tantex cultural programs

ఆంధ్ర భాషార్నవాన్ని అవలీలగా ఆపోసన పట్టి, తన ధిషణా పాటవంతో మేథో మదనం చేసి, ఆంధ్రామృతాన్ని అవలీలగా సృజింప జేస్తూ,యావదాంధ్రభాషాభిమానులకూ అంద జేస్తూ, హృదయాలలో సహృదయ శిరోమణిగా స్థిరుడై అనితర సుసాధ్యమైన అవధాన పటిమతో, ధారణా ప్రతిభతో అవధాన బ్రహ్మగా కీర్తింపబడ్డ బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు నిర్వహించిన హాస్యమయమైన “అష్టావధానం” కు విశేష స్పందన లభించింది. డా. పుదూరు జగదీశ్వరన్ సంధాతగా, శ్రీ మద్దుకూరి విజయ చంద్రహాస్,  శ్రీ జంధ్యాల శ్రీనాథ్ , శ్రీ బద్రిరాజు మూర్తి , డా. జువ్వాడి రమణ, శ్రీ మల్లవరపు అనంత్, శ్రీ కాజ సురేశ్, శ్రీమతి పాలూరి సుజన, పృచ్ఛకులు గా శ్రీ కేసి చేకూరి అప్రస్తుత ప్రసంగం, శ్రీ రాయవరం విజయభాస్కర్ మరియు శ్రీ పాలూరి రామా రావు లేఖకులుగా వ్యవహరించారు. అవధానం తరువాత  టాంటెక్స్ వారి  “తెలుగు వెలుగు” పంచమ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను డా. గరికిపాటి నరసింహారావు గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగినది.

tantex fifth anniversary, tantex celebrations dallas, tantex celebrations dallas fortworth, tantex telugu nsahithya vedika, tantex garikapati avadhanam, tantex telugu language celebrations, tantex cultural programs

టాంటెక్స్ సాంస్కృతిక సమన్వయ కర్త   శ్రీ మహేష్ ఆదిభట్ల  సమర్పించిన  సాయంకాల వినోద కార్యక్రమాలు ప్రేక్షకులకు పునస్వాగతం  పలికాయి. దాదాపు ముడు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని కూచిపూడి కళకే అంకితం చేసి, దేశ విదేశాలలో వందలాది నృత్య ప్రదర్శనలతో కూచిపూడి నృత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేస్తూ, అనేక నృత్యరూపకాలను ప్రదర్శించి వాటికి విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించి సుప్రసిద్ద చలన చిత్రాలకు నృత్య దర్శకులుగా “నంది” పురస్కారాలతో కీర్తింపబడుతున్న  “నాట్య కళా తపస్వి”, “నాట్యకళా విశారాద” శ్రీ. కెవి సత్యనారాయణ బృందం  నేటి కార్యక్రమంలో శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ రచించిన “పంచ కావ్యం” నృత్యరూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. స్థానిక నాట్యాంజలి కూచిపూడి నృత్య పాఠశాల అధినేత్రి శ్రీమతి శ్రీలత సూరి గారి సంపూర్ణ సహకారాలతో వారి శిష్య బృందం పంచకావ్యానికి జీవం పోశారు. పంచకావ్యం
లాంటి గొప్ప   ప్రబంధ కావ్య సమూహాన్ని  అమెరికాలో మొట్టమొదటి  సారిగా పూర్తి స్థాయిలో టాంటెక్స్ సాహిత్యవేదికపై ప్రదర్శించినందుకు శ్రీ జొన్నలగడ్డ సుబ్రమణ్యం శ్రీ. కెవి సత్యనారాయణ  గారికి  సభాముఖంగా  అభివందనములు తెలియజేసారు. ఎంతో ఆసక్తితో ఆష్టదిగ్గజాలుగా నటించిన స్థానిక భాషాభిమానుల  వేషధారణ మరియు వారి ఆసక్తి  శ్రీ కృష్ణదేవరాయల భువనవిజయానికి నూతన శోభను తెచ్చి పెట్టాయి.

tantex fifth anniversary, tantex celebrations dallas, tantex celebrations dallas fortworth, tantex telugu nsahithya vedika, tantex garikapati avadhanam, tantex telugu language celebrations, tantex cultural programs

గాఢమైన అభిరుచి మాత్రమే ప్రోద్బలం గా తీసుకొని, నాట్యాన్ని తన దైనందిన జీవితంలో ఎలా ఇముడ్చుకోవాలో ప్రపంచానికి చూపించి, విభిన్న భంగిమలలో వినూత్నంగా నృత్య ప్రదర్సన చేసిన కుమారి నదియ అందరినీ ఆకట్టుకొంది. ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారుడు   శ్రీ జితేంద్ర నాథ్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండువేల కార్యక్రమాలలో రాజకీయ, చలన చిత్ర రంగాల ప్రముఖుల స్వరాలను అనుకరించి ప్రేక్షకులందరినీ తమ హాస్యంతో అలరించారు.గత మూడు దశాబ్దాల కాలంలో వెయ్యికి పైగా చలన చిత్రాలకు గాత్రదానం చేయడమే కాకుండా పదివేల పైచిలుకు బుల్లితెర ధారావాహిక ఉపాఖ్యానాలకు సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా, రచయితగా, గాత్రధారునిగా సేవలందించి, అనువాద కళ పట్ల అవగాహనా ప్రాచుర్యాన్ని కల్పించాలన్న సంకల్పంతో ఎనిమిది గంటల సేపు నిర్విరామానుకరణతో కీర్తింపబడ్డ శ్రీ ఘంటసాల రత్నకుమార్ తమ గాన మాధుర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అతిథుల సన్మాన కార్యక్రమంలో  టాంటెక్స్ ఆధ్యక్షులు శ్రీమతి గీత దమ్మన్న, ఉత్తరాధ్యక్షుడు శ్రీ మండువ సురేష్, ఉపాధ్యక్షుడు, శ్రీ కాకర్ల విజయ్ మోహన్ మరియు కార్యవర్గ సభ్య బృందం, పాలక మండలి అధిపతి డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి బృందం పాల్గొని పుష్పగుచ్చం, దుశ్శాలువ మరియు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

చివరగా టాంటెక్స్  కార్యదర్శి డా. ఊరిమిండి నరసింహారెడ్డి తమ వందన సమర్పణలో  కార్యక్రమ పోషక దాతలైన లాయల్ ట్రావెల్స్, అవర్ ప్లేస్ ఇండియన్ రెస్టారెంట్, వార్షిక పోషకదాతలైన మయూరి ఇండియన్ రెస్టారెంట్, మైటాక్స్ ఫైలర్, పర్ఫెక్ట్  టాక్స్, బేలర్ మెడికల్ సెంటర్ అఫ్ అర్వింగ్, హారైజన్ ట్రావెల్స్, ప్యారడైస్ బిర్యాని పాయింట్, పసంద్ ఇండియన్ రెస్టారెంట్, సౌత్ ఫోర్క్ డెంటల్, లాసన్ ట్రావెల్స్, యూనికాన్ ట్రావెల్స్ కు, వీడియో మరియు ఫోటోగ్రఫి సేవలందించిన దేశీప్లాజా.యుఎస్   ఆడియో సహకారం అందించిన సౌండోరమ,  ప్రసార మాధ్యమాలుగా సేవలందించిన దేశీప్లాజా.యుఎస్, ఏకనజర్.కాం , రేడియోఖుషి.కాం,  టివి9, ట్రినిటీ హైస్కూల్ యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలియజేయడంతో అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడ్డ  సాహిత్య వేదిక పంచమ వార్షికోత్సవ సంబరాలకు తెరపడింది.

TeluguOne For Your Business
About TeluguOne
;