RELATED EVENTS
EVENTS
53 వ నెల నెల తెలుగు వెన్నెలకు ముఖ్య అదితి గా కోనా వెంకట్

 ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) వారి సాహిత్య వేదిక సమర్పించే "నెల నెలా తెలుగు వెన్నెల" 53 వ సాహితీ సదస్సు ఈనెల 18వ తేదీన ఇర్వింగ్ లోని ఓరీస్ ఇండియన్ రెస్టారెంట్ లో సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ మల్లవరపు అనంత్ అధ్యక్షతన స్థానిక డాల్లాస్ ప్రాంత సాహితీ మిత్రులు, తెలుగు భాషాభిమానుల మధ్య ఉత్సాహంగా జరిగింది. ముందుగా డా. జువ్వాడి రమణ ఇటీవల స్వర్గస్తులైన ప్రముఖకవి, సినీనిర్మాత, మల్లెమాల సుందరరామిరెడ్డికి నివాళిగా మల్లెమాల రచన ‘ఎంత కమ్మని భాష మనది’ వినిపించడంతో సభ ప్రారంభమైంది.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) వారి సాహిత్య వేదిక సమర్పించే "నెల నెలా తెలుగు వెన్నెల" 53 వ సాహితీ సదస్సు ఈనెల 18వ తేదీన ఇర్వింగ్ లోని ఓరీస్ ఇండియన్ రెస్టారెంట్ లో

 

మధురాంతకం నరేంద్ర ఆధ్వర్యాన వెలువడ్డ కథాసంకలనం ‘కథావార్షిక 2010’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ డా.బోయరెడ్డి సుబ్రహ్మణ్యం, మధురాంతకం రాజారాం గారితో తనపరిచయం గురించి, 1999 నుండి ప్రతిసంవత్సరం జరుగుతున్న కథావార్షిక ప్రచురణ గురించి క్లుప్తంగా చెప్పడమే కాక, తనకు బాగా నచ్చిన కథ ‘చిట్టచివరిసున్నా’ లో కొన్ని భాగాలను చదివి వినిపించారు. ఈ పుస్తకావిష్కరణలో భాగంగా, పుస్తకం మందుమాటలో కథల సింహావలోకనం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను శ్రీ మద్దుకూరి చంద్రహాస్ తెలియజేయగా, కొన్ని కథలను క్లుప్తంగా డా.జువ్వాడి రమణ సభకు పరిచయం చేసారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) వారి సాహిత్య వేదిక సమర్పించే "నెల నెలా తెలుగు వెన్నెల" 53 వ సాహితీ సదస్సు ఈనెల 18వ తేదీన ఇర్వింగ్ లోని ఓరీస్ ఇండియన్ రెస్టారెంట్ లో

 

అనంతరం పదేళ్ళ చిన్నారి రాయవరం స్నేహిత్ పారిజాతాపహరణంలోని కొన్ని పద్యాలను అర్థ తాత్పర్యాలతోచదివి వినిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తరువాత శ్రీమతి వేదుల గౌరి శాస్త్రి, కవయిత్రి వేదుల మీనాక్షీ దేవిగారి గురించి పరిచయంచేసి మీనాక్షీ దేవిగారు సంస్కృతాంధ్ర భాషల్లో కావ్యాలు వ్రాశారని, ఆరోజుల్లో స్త్రీలలో అంతటి పాండిత్యం అరుదని అన్నారు. మీనాక్షీ దేవిగారి సాహిత్యవ్యాసాలనుండి రామతత్వం ఎరిగిన స్త్రీలు అన్న వ్యాసం ఉదహరించారు. శ్రీ మల్లవరపు అనంత్ 2011 సంవత్సరాన్ని సమీక్షిస్తూ ఈ యేటి "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమాలను సింహావలోకనం చేశారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) వారి సాహిత్య వేదిక సమర్పించే "నెల నెలా తెలుగు వెన్నెల" 53 వ సాహితీ సదస్సు ఈనెల 18వ తేదీన ఇర్వింగ్ లోని ఓరీస్ ఇండియన్ రెస్టారెంట్ లో

 

అనంతరం, ముఖ్య అతిథి, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’ మొ|| విజయవంతమైన చిత్రాల రచయిత శ్రీ కోన వెంకట్ ప్రసంగిస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సభతో పంచుకున్నారు. మనసుకవి ఆత్రేయతో తన పరిచయాన్ని స్మరించుకున్నారు. సామాన్యులకి దగ్గరగా వున్నదే సాహిత్యం అని, చెప్పేవిధానం, మాటలు కధను ప్రేక్షకులకు చేరువగా తీసుకెళ్తాయని, సినిమా వ్యాపార మాధ్యమం అని, అందుకోసం కొన్నిసార్లు ప్రజలను రంజింపజేయడానికి పరభాషాపదాలను వాడవలసి వస్తుందని వివరించారు. ‘డాలస్ నాగేశ్వరరావు’ అనే పాత్ర నిజంగానే తనకు నిజజీవితంలో తారసపడిందని చెప్తూ, ఆయనకు డాలస్ వాసులకు కృతజ్ఞతలు తెలియ జేశారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) వారి సాహిత్య వేదిక సమర్పించే "నెల నెలా తెలుగు వెన్నెల" 53 వ సాహితీ సదస్సు ఈనెల 18వ తేదీన ఇర్వింగ్ లోని ఓరీస్ ఇండియన్ రెస్టారెంట్ లో

 

చివరగా ‘కింగ్’ మొ|| సినిమాల రచయిత, 'వాంటెడ్’ చిత్ర దర్శకుడు శ్రీ బివియస్ రవి ఆదికాలంనుండి ఇప్పటి వరకూ తెలుగు భాషలో వచ్చిన పరిణామాలు వివరిస్తూ సినిమాకోసం భాషను సరళీకృతం చేసుకోవడం అనాదిగా జరుగుతున్నదానికి విరుధ్ధం కాదన్నారు. శ్రీ కోన వెంకట్, బివియస్ రవిలను టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ ఎన్‌ఎమ్‌ఎస్ రెడ్డి, ఉత్తరాధ్యక్షులు శ్రీమతి గీత దమ్మన్న మరియు వారి కార్యవర్గ బృందం దుశ్శాలువలతో, సాహిత్య వేదిక కార్యవర్గం జ్ఞాపికలతో సత్కరించడంతొ సభ ముగిసింది.

TeluguOne For Your Business
About TeluguOne
;