RELATED ARTICLES
ARTICLES
తానా బోర్డ్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి

ప్రతిష్టాకరమైన తానా బోర్డు కి ఈ రాత్రి జరిగిన ఎన్నికలలో డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి గారు ఏకగ్రీవంగా బోర్డ్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.

వారితో పాటు కార్యదర్శి గా శ్రీమతి లక్ష్మి దేవినేని గారు కోశాధికారిగా శ్రీ జనార్దన్ (జూనీ ) నిమ్మలపూడి గారు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి:

ప్రపంచ ప్రతిష్టాకరమైన టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పటిల్ లో పీడియాట్రిక్ కార్డియోవాస్క్యూలర్ అనేస్తేషలోజి లో డాక్టర్ శ్రీనివాస్ గారు సేవలందిస్తున్నారు అలాగే బేలోర్ కాలేజీ అఫ్ మెడిసిన్ లో వైద్య విద్యని బోధిస్తున్నారు. గతంలో తానా బోర్డు కార్యదర్శి గా మరియు ప్రతిష్టాకరమైన తానా- బసవతారకం ప్రాజెక్ట్ కి ముందు ఉండి మార్గదర్శకాలతో పాటు కోటి రూపాయిల నిధిని సమకూర్చి బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి వైద్య పరికరాల కొనుగోలుకు తానా ఫౌండేషన్ తరుపున అందించటం లో ముఖ్య భూమిక ఫోషించారు. అలాగే సనాతన హిందూ ధార్మిక కార్యక్రమాలు అయిన వేద పాఠశాలలు , గోశాలలు, గురుకులాల మరియు దేవాలయాల అభివృద్ధికి ఆర్ధిక వనరులు సమకూర్చటం తో పాటు విశేష సేవలందిస్తున్నారు.

బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన శ్రీమతి లక్ష్మి దేవినేని గారు గతంలో తానా బోర్డు కోశాధికారిగా , న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ గా, విమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ గానే కాకుండా ఇటీవలే జరిగిన 23 వ తానా మహా సభలలో పలు కమిటీలలో ఆమె సేవలందించారు .

బోర్డు కోశాధికారిగా ఎన్నికైన జనార్దన్ నిమ్మలపూడి గారు గతంలో 21 వ తానా మహాసభల కార్యదర్శి గా , కాపిటల్ రీజియన్ కోఆర్డినేటర్ గానే కాకుండా కాన్సర్ అవగాహన మరియు నిధుల సమీకరణం కోసం ప్రపంచ లో ఎత్తైన కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించారు అలాగే ఈ మధ్య జరిగిన 23 వ తానా మహాసభలలో ఎన్ టి ఆర్ మెమోరియల్ ట్రస్ట్ కి కోటి రూపాయల నిధిని సమకూర్చడంలో ప్రత్యేక పాత్ర ఫోషించారు .

తానా బోర్డు చైర్మన్ గా ఎన్నికైన డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి గారు తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు తానా ఫౌండేషన్ ని సమన్వయ పరుచుకుంటూ,సరిఅయిన దిశలో మార్గ నిర్దేశం చేస్తూ తానా సేవలను , ప్రతిష్టని సమర్ధవంతంగా మరింత ముందుకు తీసుకు వెళ్తాము అని అలాగే బోర్డు అఫ్ డైరెక్టర్స్ తమ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా తానా ని తెలుగు వారికి మరింత చేరువ చేయటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం అని తెలిపారు

TeluguOne For Your Business
About TeluguOne
;