- టెంపాలో నాట్స్ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం
- ఘనంగా ముగిసిన నాట్స్ తెలుగు సంబరాలు..
- నాట్స్ సంబరాలు - రెండో రోజు సాయంత్రం విశేషాలు
- చికాగోలో ఘనంగా ప్రారంభమైన నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు
- 5 వ అమెరికా తెలుగు సంబరాల్లో తెలుగు కు పెద్ద పీట వేసిన నాట్స్..
- అమెరికా తెలుగు సంబరాలకు ముమ్మరంగా సన్నాహాలు
- కార్లటన్ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన
- నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో సందడి చేయనున్న డీజే
- జోరందుకున్న నాట్స్-2017 సంబరాలకు సన్నాహాలు...
- నాట్స్ పై కే.టీ.ఆర్ ప్రశంసల వర్షం..
- సీఎం తో నాట్స్ ప్రతినిధుల భేటీ...
- నాట్స్ పై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ప్రశంసల వర్షం
- నాట్స్ ప్రస్థానంలో మరో ముందడుగు.. హారిస్ బర్గ్ లో ప్రారంభమైన నాట్స్ చాప్టర్
- నాట్స్ ఆధ్వర్యంలో ఇమిగ్రేషన్ సదస్సుకు మంచి స్పందన
- పేద పిల్లలకు పౌష్టికాహరం అందించే సత్కార్యంలో సీటీఏ-నాట్స్
- నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
- ఘనంగా నాట్స్ రిపబ్లిక్ డే వేడుకలు...
- సునీల్ కు సాయం చేద్దాం రండి..: నాట్స్
- న్యూజెర్సీ సాయి దత్త పీఠం లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
- హరితాంధ్ర సాధనలో నాట్స్ చేస్తున్న కృషికి బాబు అభినందనలు
- సమానసేవకై ఉద్యమిస్తున్న నాట్స్ కు బిల్ గేట్స్ ప్రశంసలు
- Nats Update On Trivalley University Students
- Sooktula Poteelu For Nats Telugu Calendar
ఘనంగా నాట్స్ మిస్సోరీ విభాగం 5 వ వార్షికోత్సవం
*సెయింట్ లూయిస్ లో అలరించిన తెలుగు ఆట.. పాట..
నవ్వులు పూయించిన రమేష్ మిమిక్రీ*
సెయింట్ లూయిస్: డిసెంబర్: 10 అమెరికా లో తెలుగు జాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్... అమెరికాలో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. నాట్స్ మిస్సోరీ విభాగం.. మిస్సోరీలో ఉండే తెలుగువారికి ఆనతి కాలంలోనే చేరువై.. వారి ప్రేమాభిమానాలు సంపాదించుకుంది. నాట్స్ జాతీయ కోశాధికారి శ్రీనివాస్ మంచికలపూడి నాయకత్వంలో నాట్స్ మిస్సోరీ విభాగం 5 వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సెయింట్ లూయిస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగువారు విచ్చేశారు. తెలుగు చిన్నారుల ఆట, పాటలకు విశేష స్పందన లభించింది.
తెలుగుదనాన్ని గుర్తు చేసే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.. రమేష్ మిమిక్రీ సభలో నవ్వులు పూయించింది.. తెలుగువారికి నాట్స్ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతోందనేది శ్రీనివాస్ మంచికలపూడి వివరించారు. నాట్స్ హెల్ఫ్ లైన్, నాట్స్ బీమా పథకాల గురించి ఆయన తెలిపారు. నాట్స్ లో ఉత్సాహంగా పనిచేస్తూ తోటి వారిలో స్ఫూర్తి నింపుతున్న వారికి కమ్యూనిటీ అవార్డులను ఈ వేదికపై అందించారు. సతీష్ బాబు, గిరిధర్ శ్రీపెరంబదూర్, దండురఘునందన్ లను ఈ అవార్డులు వరించాయి. నాట్స్ ఉచిత వైద్య శిబిరంలో తమ విలువైన సేవలు అందించిన వారికి, విద్యా సంబంధిత విషయాలపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు కూడా నాట్స్ ఈ సభా వేదికపై అవార్డులు అందించింది. ఈ వార్షికోత్సవాన్ని దిగ్విజయం చేయడంలో నాట్స్ సెయింట్ లూయిస్ టీం చేసిన కృషిని నాట్స్ జాతీయ నాయకత్వం ప్రశంసించింది. నాట్స్ డైరక్టర్ డాక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ హెల్ఫ్ లైన్ టీం సభ్యుడు హరీందర్ గరిమెళ్ల, నాట్స్ సెయింట్ లూయిస్ చాప్టర్ కో ఆర్డినేటర్ సతీష్ ముమ్మనగండి చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించింది.
వైఎస్ఆర్ కే ప్రసాద్, శిష్ట్ల నాగ శ్రీనివాస్, సురేంద్ర బాచిన, రమేష్ బెల్లం, టీఏఎస్ బోర్డు ఛైర్మన్ కుమార్ రెడ్డి తదితర ప్రముఖులు నాట్స్ వార్షికోత్సవానికి తమ వంతు సహకారం అందించినందుకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ప్రసాద్ రావెళ్ల, చిన్నా ముచ్చెర్ల, రంగాసురేష్, శివకృష్ణ మామిళ్లపల్లి, నిషా మగులూరు, వ్యాఖ్యతగా వ్యవహరించిన సుమలత అరేపల్లి, శిరిషా యలమంచిలి తదితరులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. డాక్టర్ కాజా రామారావు, ఎల్ ఎన్ రావు,జితేంద్ర అలూరి, విజయ్ బుడ్డి, శ్రీనివాస్ అట్లూరి, డాక్టర్ బొడావుల వెంకట్, డాక్టర్ బాపూజీ, కోటారు శ్రీనివాస్, గోపి ఉప్పాల, శ్రీకాంత్ వడిరెడ్డి, సురేష్ యలవర్తి, శేషు, చంద్ర పొట్లూరి, శేషు కాట్రగడ్డ,శేషు ఇంటూరి, సుమన్ కలవగుంట్ల, రవిరాజ్ కొలకలేటి, రాజ్ ఓలేటి, మధు సామల తదితర స్థానిక తెలుగు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పసందైన తెలుగింటి విందు కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.