- టెంపాలో నాట్స్ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం
- ఘనంగా ముగిసిన నాట్స్ తెలుగు సంబరాలు..
- నాట్స్ సంబరాలు - రెండో రోజు సాయంత్రం విశేషాలు
- చికాగోలో ఘనంగా ప్రారంభమైన నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు
- 5 వ అమెరికా తెలుగు సంబరాల్లో తెలుగు కు పెద్ద పీట వేసిన నాట్స్..
- అమెరికా తెలుగు సంబరాలకు ముమ్మరంగా సన్నాహాలు
- కార్లటన్ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన
- నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో సందడి చేయనున్న డీజే
- జోరందుకున్న నాట్స్-2017 సంబరాలకు సన్నాహాలు...
- నాట్స్ పై కే.టీ.ఆర్ ప్రశంసల వర్షం..
- సీఎం తో నాట్స్ ప్రతినిధుల భేటీ...
- నాట్స్ పై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ప్రశంసల వర్షం
- నాట్స్ ప్రస్థానంలో మరో ముందడుగు.. హారిస్ బర్గ్ లో ప్రారంభమైన నాట్స్ చాప్టర్
- నాట్స్ ఆధ్వర్యంలో ఇమిగ్రేషన్ సదస్సుకు మంచి స్పందన
- పేద పిల్లలకు పౌష్టికాహరం అందించే సత్కార్యంలో సీటీఏ-నాట్స్
- నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
- ఘనంగా నాట్స్ రిపబ్లిక్ డే వేడుకలు...
- న్యూజెర్సీ సాయి దత్త పీఠం లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
- హరితాంధ్ర సాధనలో నాట్స్ చేస్తున్న కృషికి బాబు అభినందనలు
- సమానసేవకై ఉద్యమిస్తున్న నాట్స్ కు బిల్ గేట్స్ ప్రశంసలు
- Nats Update On Trivalley University Students
- Sooktula Poteelu For Nats Telugu Calendar
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే నాట్స్ ప్రస్తుతం ఓ తెలుగుకుటుంబాన్ని ఆదుకునేందుకు అమెరికాలో తెలుగు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.
అమెరికా.. హవాయిలో ప్రమాదవశాత్తు ఈత కొలనులో పడిన సియాటెల్, వాషింగ్టన్ ప్రాంతానికి చెందిన అత్యం సునీల్ గవాస్కర్ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. హవాయిలో నివాసముంటున్న సునీల్ కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారు. కొలను పక్కన నడుచుకుంటు వెళ్తున్న సునీల్ పొరపాటున కాలుజారి కొలనులో పడిపోయాడు. సునీల్ కు ఈతరాకపోవడం అతడికి శాపంగా మారింది. స్థానికంగా ఉండే ముగ్గురు అతడిని కొలను నుంచి బయటకు తెచ్చారు. అయితే అప్పటికే సునీల్ కోమాలోకి వెళ్లిపోయాడు. బ్రైన్ సెల్స్ దెబ్బతిన్నాయని అతనికి చికిత్స చేస్తున్న వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సునీల్ ను మృత్యువు బారి నుంచి కాపాడే ప్రయత్నం డాక్టర్లు చేస్తున్నారు. అయితే సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన సునీల్ ను బతికించుకోవాలంటే ప్రస్తుతం వైద్యఖర్చులు ఆ కుటుంబానికి ఆర్ధిక భారంగానే మారాయి. ఈ విషయం తెలుసుకున్న నాట్స్ వెంటనే రంగంలోకి దిగింది. సునీల్ వైద్య ఖర్చులకు తన వంతు సాయం అందించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో నాట్స్ సభ్యులను, నాట్స్ పిలుపుకు ప్రతిస్పందించే ప్రతి ఒక్కరిని సునీల్ కు సాయం చేద్దాం రండి అని కోరుతోంది.