- టెంపాలో నాట్స్ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం
- ఘనంగా ముగిసిన నాట్స్ తెలుగు సంబరాలు..
- నాట్స్ సంబరాలు - రెండో రోజు సాయంత్రం విశేషాలు
- చికాగోలో ఘనంగా ప్రారంభమైన నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు
- 5 వ అమెరికా తెలుగు సంబరాల్లో తెలుగు కు పెద్ద పీట వేసిన నాట్స్..
- అమెరికా తెలుగు సంబరాలకు ముమ్మరంగా సన్నాహాలు
- కార్లటన్ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన
- నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో సందడి చేయనున్న డీజే
- జోరందుకున్న నాట్స్-2017 సంబరాలకు సన్నాహాలు...
- నాట్స్ పై కే.టీ.ఆర్ ప్రశంసల వర్షం..
- సీఎం తో నాట్స్ ప్రతినిధుల భేటీ...
- నాట్స్ పై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ప్రశంసల వర్షం
- నాట్స్ ప్రస్థానంలో మరో ముందడుగు.. హారిస్ బర్గ్ లో ప్రారంభమైన నాట్స్ చాప్టర్
- నాట్స్ ఆధ్వర్యంలో ఇమిగ్రేషన్ సదస్సుకు మంచి స్పందన
- పేద పిల్లలకు పౌష్టికాహరం అందించే సత్కార్యంలో సీటీఏ-నాట్స్
- నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
- ఘనంగా నాట్స్ రిపబ్లిక్ డే వేడుకలు...
- సునీల్ కు సాయం చేద్దాం రండి..: నాట్స్
- న్యూజెర్సీ సాయి దత్త పీఠం లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
- హరితాంధ్ర సాధనలో నాట్స్ చేస్తున్న కృషికి బాబు అభినందనలు
- సమానసేవకై ఉద్యమిస్తున్న నాట్స్ కు బిల్ గేట్స్ ప్రశంసలు
- Nats Update On Trivalley University Students
- Sooktula Poteelu For Nats Telugu Calendar
న్యూజెర్సీ నాట్స్ క్యాన్ ఫుడ్ డ్రైవ్
అన్నార్తులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన నాట్స్
న్యూ బృన్స్విక్: డిసెంబర్ 3: ఆకలితో ఉన్న వారికి ఆ ఆకలి తీర్చడమే అత్యుత్తమ సేవగా భావించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికా వ్యాప్తంగా ఒన్ మిలియన్ ఫుడ్ డ్రైవ్ అంటూ రంగంలోకి దిగింది. నాట్స్ ఇచ్చిన పిలుపుకు అమెరికాలో నాట్స్ విభాగాలన్నీ స్పందిస్తున్నాయి. తాజాగా న్యూజెర్సీ లో నాట్స్ ఒన్ మిలియన్ ఫుడ్ డ్రైవ్ కు విశేష స్పందన లభించింది. నాట్స్ సభ్యులతో పాటు స్థానికంగా ఉండే తెలుగువారంతా పేదలకు అందించే ఫుడ్ క్యాన్స్ సేకరించడంలో మేముసైతం అని పోటీపడ్డారు. నాట్స్ ప్రెసిడెంట్ మోహనకృష్ణ మన్నవ నాయకత్వంలో ఈ ఫుడ్ డ్రైవ్ జరిగింది. నాట్స్ నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడింట్ శ్రీహరి మందాడి, న్యూజెర్సీ నాట్స్ కో ఆర్డినేటర్ వంశీకృష్ణ వెనిగళ్ల, విష్ణు ఆలూరు మద్దతుతో చాలా మంది ఈ ఫుడ్ డ్రైవ్ లో పాల్గొన్నారు. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్యాం మద్దాళి, నాట్స్ మాజీ అధ్యక్షుడు బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గంగాధర్ దేసు తో పాటు న్యూజెర్సీ నాట్స్ నాయక గణం రమేష్ నూతలపాటి, మురళీ కృష్ణ మేడిచెర్ల, అరుణ గంటి, శ్యాం నాళం, చంద్రశేఖర్ కొణిదిల, సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, శేషగిరి కంభంమెట్టు, అరుణ్ మాదిరాజు, మోహన్ రావు కూనమనేని, శ్రీధర్ దోనేపూడి, రేవంత్ ఇనగళ్ల ఒన్ మిలియన్ క్యాన్ ఫుడ్ డ్రైవ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అన్న నినాదాన్ని చేతల్లో రుజువు చేస్తూ నాట్స్ ప్రతి యేటా భారీ ఎత్తున ఈ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
న్యూజెర్సీతో పాటు అమెరికాలోని పలు నగరాల్లో ఈ ఫుడ్ డ్రైవ్ జరగనుంది. ఫుడ్ డ్రైవ్ ద్వారా సేకరించిన ఫుడ్ క్యాన్స్ ను స్థానిక ఓజామన్ కేథలిక్ ఛారిటీకి నాట్స్ డోనేట్ చేసింది. పేదపిల్లల కడుపులు నింపేందుకు ఈ ఛారిటీ సంస్థ పనిచేస్తుంది. నాట్స్ ప్రతి చాప్టర్ లోనూ ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహించి పేదపిల్లల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తోంది. నాట్స్ పిలుపుకు స్పందించి తమ వంతుగా ఫుడ్ క్యాన్స్ అందించిన ప్రతి ఒక్కరిని నాట్స్ ధన్యవాదాలు తెలుపుతోంది.