RELATED ARTICLES
ARTICLES
న్యూజెర్సీ సాయి దత్త పీఠం లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం


న్యూజెర్సీ సాయి దత్త పీఠం లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం


 

న్యూ జెర్సీ: సౌత్ ప్లైన్ఫీల్డ్: అమెరికాలోని తెలుగు ప్రజలకు అండగా నిలిచే నాట్స్.. న్యూజెర్సీలోని సాయి దత్త పీఠంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. సేవే గమ్యం అని నినదించే నాట్స్ తో కలిసి నడుస్తున్న వైద్యులు ఈ ఉచిత వైద్య శిబిరంలో తమ విలువైన సేవలను ఉచితంగా అందించారు. దాదాపు 100 మందికి పైగా  రోగులకు ఉచితంగా ఫ్లూ షాట్స్ అందించారు. 200 మందికి పైగా భారతీయులు ఈ వైద్య శిబిరంలో సేవలను సద్వినియోగం చేసుకున్నారు. సాటి వారికి సాయపడటమే సాయి తత్వమని చెప్పే సాయి దత్త పీఠం  ఈ ఉచిత వైద్య శిబిరానికి తన వంతు సహకారం అందించింది..అమెరికాలో ఉచిత వైద్య శిబిరాలతో నాట్స్ తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటుని నాట్స్ బోర్డ్ ఆఫ్ ఛైర్మన్ శ్యాం మద్ధాళి అన్నారు. మానవసేవయే మాధవ సేవ అనేది నాట్స్ నమ్ముతోందని అందుకే సేవా కార్యక్రమాలతో నాట్స్ తెలుగు వారికి చేరువైందని తెలిపారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు.. హెల్ఫ్ లైన్ ద్వారా అందిస్తున్న సేవలు గురించి నాట్స్ ప్రెసిడెంట్  మోహన కృష్ణ మన్నవ అన్నారు. సేవా భావం కలిగిన ప్రతి ఒక్కరు ఇప్పుడు నాట్స్ తో కలిసి అడుగులు వేసేందుకు ముందుకు వస్తున్నారని మోహన కృష్ణ మన్నవ అన్నారు.. నాట్స్ బోర్డ మాజీ ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరక్టర్ డాక్టర్ మధు కొర్రపాటి ఈ వైద్య శిబిరంలో తన మిత్రబృందమైన డా. బొల్లు జనార్థన్, డా. రాజు రమేష్, డా. వాసిరెడ్డి లత, డా. గుమ్మకొండ రమ, డా. తుమ్మలపెంట నిర్మల, డా. నిమ్మ విజయ విలువైన వైద్య సేవలు అందించారు. న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉపేంద్ర చివుకుల నాట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

సేవే లక్ష్యంగా తెలుగు ప్రజలకు నాట్స్ అనేక సేవలు అందిస్తుందని ఇది మరెన్నో తెలుగు సంఘాలకు స్ఫూర్తి నిస్తుందన్నారు. ఇదే  వేదికపై  చివుకుల ఉపేంద్ర 40 వ వివాహ వార్షికోత్సవ వేడుకను కూడా నిర్వహించారు. అమెరికా రాజకీయాల్లో రాణిస్తున్న ఉపేంద్ర చివుకుల యావత్ తెలుగుజాతికి గర్వకారణమైన వ్యక్తి అని నాట్స్ ప్రతినిధులు కొనియాడారు. నాట్స్ ఉచిత వైద్య శిబిరం విజయవంతం కావడానికి నాట్స్ ప్రతినిధులు.. నాట్స్ సెక్రటరీ రమేష్ నూతలపాటి,  నాట్స్ నేషనల్ మీడియా కోఆర్డినేటర్ మేడిచెర్ల మురళీకృష్ణ, నాట్స్ న్యూ జెర్సీ కోఆర్డినేటర్ వెనిగళ్ల వంశీకృష్ణ, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి , న్యూ యార్క్ కోఆర్డినేటర్ నాళం శ్యామ్, ఆలూరు విష్ణు, గుర్రం ప్రసాద్, వెంకట్ శ్రీనివాస్, కుమ్మనేని మోహన్, గుత్తికొండ  సూర్య,వెనిగళ్ల మోహన్ కుమార్  తదితరులు ఎంతగానో కృషి చేశారు. స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకొచ్చిన నాట్స్ వాలంటీర్ల ను నాట్స్ నాయకత్వం అభినందించింది. సాయి దత్త పీఠం నిర్వహకులు రఘుశర్మ  శంకరమంచి అందించిన సహకారాన్ని నాట్స్ ప్రశంసించింది.

TeluguOne For Your Business
About TeluguOne
;