- టెంపాలో నాట్స్ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం
- ఘనంగా ముగిసిన నాట్స్ తెలుగు సంబరాలు..
- నాట్స్ సంబరాలు - రెండో రోజు సాయంత్రం విశేషాలు
- 5 వ అమెరికా తెలుగు సంబరాల్లో తెలుగు కు పెద్ద పీట వేసిన నాట్స్..
- అమెరికా తెలుగు సంబరాలకు ముమ్మరంగా సన్నాహాలు
- కార్లటన్ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన
- నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో సందడి చేయనున్న డీజే
- జోరందుకున్న నాట్స్-2017 సంబరాలకు సన్నాహాలు...
- నాట్స్ పై కే.టీ.ఆర్ ప్రశంసల వర్షం..
- సీఎం తో నాట్స్ ప్రతినిధుల భేటీ...
- నాట్స్ పై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ప్రశంసల వర్షం
- నాట్స్ ప్రస్థానంలో మరో ముందడుగు.. హారిస్ బర్గ్ లో ప్రారంభమైన నాట్స్ చాప్టర్
- నాట్స్ ఆధ్వర్యంలో ఇమిగ్రేషన్ సదస్సుకు మంచి స్పందన
- పేద పిల్లలకు పౌష్టికాహరం అందించే సత్కార్యంలో సీటీఏ-నాట్స్
- నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
- ఘనంగా నాట్స్ రిపబ్లిక్ డే వేడుకలు...
- సునీల్ కు సాయం చేద్దాం రండి..: నాట్స్
- న్యూజెర్సీ సాయి దత్త పీఠం లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
- హరితాంధ్ర సాధనలో నాట్స్ చేస్తున్న కృషికి బాబు అభినందనలు
- సమానసేవకై ఉద్యమిస్తున్న నాట్స్ కు బిల్ గేట్స్ ప్రశంసలు
- Nats Update On Trivalley University Students
- Sooktula Poteelu For Nats Telugu Calendar
చికాగోలో ఘనంగా ప్రారంభమైన నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు
తరలివచ్చిన తెలుగు అతిరథ మహారథులు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలు ఈసారి చికాగో వేదికగా ప్రారంభమయ్యాయి.. బాంక్వెట్ కార్యక్రమంతో ప్రారంభమైన ఈ సంబరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథమహారథులు విచ్చేశారు. నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ, సంబరాల కన్వీనర్ రవి ఆచంట, సుజన ఆచంట వెంటరాగా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ రచయిత, భాషా కోవిదులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ , తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి, ఎన్.ఆర్.ఐ పారిశ్రామికవేత్త ముక్కామల అప్పారావులు జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాలను ప్రారంభించారు.
భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే నాట్స్ దానికి తగ్గట్టుగా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుందనేది నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్యాం మద్దాళి వివరించారు. తెలుగు సంఘాల చరిత్రలో తొలిసారిగా నాట్స్ చేపట్టిన హెల్ఫ్ లైన్, స్టూడెంట్ బీమా పథకాల గురించి మద్దాళి తన ప్రసంగంలో స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను కూడా శ్యాం మద్దాళి తెలిపారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్లను శ్రీధర్ అప్పసాని సభకు పరిచయం చేశారు. చికాగోలోని తెలుగువారి ఈ మూడు రోజుల సంబరాలను విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ తరపున ఉత్తమ సేవలు అందించిన వారితో పాటు.. నాట్స్ నిర్వహించిన క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు. బాంక్వెట్ కార్యక్రమంలో సంగీత విభావరి, మిమిక్రి రాజు చేసిన మిమిక్రి అందరినీ అలరించింది. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సాయి కుమార్ తో పాటు, హాస్య నటుడు పృధ్వి , హీరో నిఖిల్, జబర్దస్త్ కామెడీ టీం, ప్రముఖ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, తెలంగాణ టీడీపీ నేత ఇ.పెద్దిరెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు ఈ బాంక్వెట్ లో పాల్గొన్నారు. దువ్వాడ జగన్నాథమ్ (డీజే) టీం కూడా సంబరాల్లో సందడి చేయనుంది. అమెరికాలోని తెలుగువారికి అంతులేని సంతోషాలను ఈ సంబరాలు పంచనున్నాయి. బావార్చీ బిర్యానీ వారి విందు బహు పసందు అని ప్రశంసలందుకొంది.