Publish Date:Apr 26, 2022
ఏపీలో వండర్ జరిగింది. సోమవారం ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. రెండేళ్ల తర్వాత రాష్ట్రం జీరో కరోనా కేస్ డే గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసులు లేవని కావు. ఉన్నాయి కానీ, సోమవారం మాత్రం కొత్తగా ఒక్కటంటే ఒక్క కేసు కూడా రాకపోవడం విశేషం. ఏపీలో ప్రస్తుతం 22 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
సోమవారం రాష్ట్రంలో ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. ఏపీలో కరోనా విలయం మొదలైన తర్వాత జీరో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. 2020 మార్చి 9న ఏపీలో తొలి కేసు నమోదైంది. కానీ ఆరోగ్యశాఖ అధికారులు మార్చి 12న నమోదైనట్టు చూపించారు. అప్పటి నుంచి ప్రతి దశలోనూ అత్యధికంగా నమోదవుతూనే ఉన్నాయి. ఓ దశలో ఒక్కరోజులోనే 24 వేల కేసులు కూడా వచ్చాయి. కానీ.. ప్రస్తుతం కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,163 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 23,19,662 మంది కరోనా బారినపడ్డారు. సోమవారం 12 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా కట్టడికి జగన్ సర్కారు పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రుల్లో సరైన చికిత్స అందక.. బాధితులు తెలంగాణకు వలస కట్టడం చూశాం. మందుల కొరత, ఆక్సిజన్ సిలిండర్ల కొరత, బెడ్స్ కొరత.. ఇలా రెండేళ్లు ప్రజలను వాళ్ల మానాన వారిని వదిలేశారే కానీ.. ప్రభుత్వం తరఫున కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంది లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొవిడ్ చికిత్సకు వచ్చిన బాధితుల కుటుంబ సభ్యులపై అఘాయిత్యాలు, వ్యభి-చార కూపంలోకి నెట్టిన ఘటనలూ జరగడం మరింత దారుణం. బ్లీచింగ్ పౌడర్ చల్లడం మినహా వైసీపీ సర్కారు ప్రజలపై శ్రద్ధ పెట్టింది లేదని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉచిత వ్యాక్సినేషన్ సక్సెస్ కావడం.. కరోనా వేవ్ ఖతం కావడంతో.. తాజాగా సున్నా కేసులతో ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/zero-corona-cases-in-ap-39-134992.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.