కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనం లాంఛనమే.. రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ కు టానిక్

Publish Date:Aug 31, 2023

Advertisement

వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం ఇక లాంఛనమే. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల గురువారం (ఆగస్టు 31) హస్తినలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు. తన భర్త అనీల్ తో కలిసి సోనియాతో భేటీ అయిన అనంతరం షర్మిల ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. గత కొద్ది రోజులుగా వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనంపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విలీన చర్చలలో అనేక ఆప్షన్స్ వెలుగులోనికి వచ్చాయి.

వైఎస్ షర్మిల తొలి నుంచీ కూడా తన కార్యక్షేత్రం తెలంగాణయే అని చెబుతూ వస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఆమె అవసరం తెలంగాణలో కంటే ఏపీలో ఎక్కువ ఉందని చెబుతూ వస్తున్నది. దీంతో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఆమె సేవలు ఎక్కడ అన్న విషయంలో ఏర్పడిన ప్రతిష్ఠంభన కారణంగానే ఇప్పటి వరకూ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. అయితే గురువారం (ఆగస్టు 31) షర్మిల సోనియా భేటీతో విలీనం విషయంలో స్పష్టత వచ్చింది. ఈ విలీనం కారణంగా కాంగ్రెస్ కు భారీ ప్రయోజనం చూకూరుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏపీలో  కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్న కాంగ్రెస్ ప్రతిపాదనకు షర్మిల అంగీకారం తెలిపారని చెబుతున్నారు.

షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా తెలంగాణలో వైఎస్ బ్రాండ్ ను తిరిగి తెరమీదకు తీసుకురావడం ద్వారా ఆ రాష్ట్రంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం సంతృప్తి చెందుతుంది. అదే సమయంలో ఆమె ఏపీలో కీలక పాత్ర పోషించడం ద్వారా వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీకి తరలిపోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు తిరిగి కాంగ్రెస్ కు దగ్గరయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. అన్నిటికీ మించి తెలంగాణలో అధికారం కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్ కు వైఎస్సార్టీపీ విలీనం బోనస్ అవుతుందనే చెప్పాలి. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో తెలంగాణ ఇచ్చిన సోనియాను కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ణతలు తెలిపిన కేసీఆర్ టీఆర్ఎస్ ( ఇప్పుడు బీఆర్ఎస్) ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ప్రకటించారు. అయితే ఆ తరువాత మాట తప్పడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికినే ప్రశ్నార్థకం చేసే విధంగా ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ ను బలహీనం చేశారు. అది పక్కన పెడితే ఇప్పుడు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ అయ్యారు. కేసీఆర్ లా తాను మాట తప్పననీ, చెప్పింది చేస్తాననీ షర్మిల గట్టిగా చెప్పే అవకాశం ఉంది.

సోనియాతో భేటీ తరువాత మీడియాతో మాట్లాడిన షర్మిల తెలంగాణలో కేసీఆర్ పాలన అంతమయ్యే సమయం వచ్చిందని చేసిన వ్యాఖ్యను ఈ నేపథ్యంలోనే తీసుకోవలసి ఉంటుంది. తాను స్వయంగా ఏపీ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించడానికి అంగీకరించి కూడా షర్మిల తెలంగాణ రాజకీయాల గురించి, మరీ ముఖ్యంగా కేసీఆర్ నియంతృత్వ పోకడలు, కుటుంబ పాలనపై చేసే విమర్శలు  బీఆర్ఎస్ కు కచ్చితంగా నష్టం చేకూరుస్తాయని కాంగ్రెస్ గట్టిగా విశ్వసిస్తున్నది. అలాగే రెండు రాష్ట్రాలలోనూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న ప్రజాభిమానం షర్మిల పార్టీ విలీనంతో కాంగ్రెస్ కు ఒక పాజిటివ్ వేవ్ గా పనికి వస్తుందని కాంగ్రెస్ విశ్వసిస్తున్నది.    తెలంగాణ ఎన్నికల  సమయం ముంచుకువస్తున్న తరుణంలో ఇక ఏమాత్రం  ఆలస్యం చేయకుండా ముందుగా షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ డిసైడెంది.

ఆమెకు ఏపీలో కీలక పాత్ర ఇచ్చినా.. ఆమె సేవలను మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వినియోగించుకునే విధంగా వ్యూహ రచన చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు షర్మిల అంగీకారం తెలపడంతోనే సోనియాతో భేటీ  కుదిరిందని చెబుతున్నారు. సోనియాతో భేటీలో కూడా ఏపీలో పార్టీ బాధ్యతలను షర్మిల చేపట్టాలని కాంగ్రెస్ చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కూడా షర్మిల పాల్గొంటారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విలీన ప్రకటన వైఎస్ వర్ధింతి అయిన సెప్టెంబర్ 2న అధికారికంగా వెలువడుతుందని చెబుతున్నారు.  సోనియాతో చర్చల సందర్భంగా షర్మిల రాహుల్ ను ప్రధాని చేయాలనే తన తండ్రి లక్ష్య సాధన కోసం పని చేస్తానని చెప్పారని చెబుతున్నారు.  

విలీనం ప్రతిపాదనల మేరకు  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే షర్మిల తన సేవలను పూర్తిగా ఏపీకే పరిమితం చేస్తారనీ, మరీ ముఖ్యంగా తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్  ను గద్దెదింపడమే లక్ష్యంగా ముమ్మర ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు పూర్తవుతూనే ఏపీలో ఫోకస్ చేసేలా ఇప్పటికే షర్మిలతో కాంగ్రెస్ నాయకత్వం చర్చలు చేసింది. పార్టీ తరపున ఏపీలో ప్రచారానికి షర్మిల అంగీకరించారని సమాచారం. ఇదే సమయం లో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగించేందుకు సిద్దమైంది. దీని ద్వారా ఏపీలో సీఎం జగన్..ఆయన ఓట్ బ్యాంక్ లక్ష్యంగా ఏపీలో షర్మిల సేవలను కాంగ్రెస్ వినియోగించుకోవాలని భావిస్తోంది.  అలాగే షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభ ఆఫర్ తో పాటుగా కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు బరిలోకి దించే ప్రతిపాదన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినట్లు, ఆ ప్రతిపాదనకు షర్మిల అంగీకరించినట్లూ విశ్వసనీయ సమాచారం. ఏపీ బాధ్యతలు షర్మిలకు అప్పగించడం ద్వారా విభజన తరువాత జగన్ వైపు మళ్లిన కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు తిరిగి పార్టీ వైపు వస్తుందని కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు.  

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.