తెలంగాణలో షర్మిల పార్టీ పరిస్థితి ఏంటి?

Publish Date:Oct 12, 2023

Advertisement

ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడమే తరవాయి అనుకున్న వైఎస్ షర్మిల పరిస్థితి నిస్సందేహంగా దయనీయంగా మారింది. ఆమె రాజకీయాలకు ఇక ఫుల్ స్టాపేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అసలు ఆమె తెలంగాణలో రాజకీయం ప్రారంభించినప్పుడే.. చాలా మందిలో చాలా చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సాటి తెలుగు రాష్ట్రం ఏపీలో ఆమె  సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు ఆ  పదవి దక్కడంలో షర్మిల పాత్రను విస్మరించడం సాధ్యం కాదు. అక్రమాస్తుల కేసులో అన్న జగన్ జైలులో ఉండగా ఆమె రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు? అనే చర్చ విస్తృతంగా జరిగింది.

అప్పట్లోనే  ‘షర్మిల ఎవరు వదిలిన బాణం?’. అనే ప్రశ్న ప్రముఖంగా వినిపించింది. అయితే,ఇప్పడు అదొక రకంగా ముగిసన అధ్యాయం. అక్కడి నుంచి ఆమె చాలా దూరం నడిచేశారు. వైఎస్సార్ టీపీ పేరిటి పార్టీని ఏర్పాటు చేసి ఆమె బాటలో ఆమె రాజకీయంగా అడుగులు వేశారు.  తెలంగాణలో ఆమె అధికార పార్టీ బీఆర్ఎస్ పైనా, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితపై ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ల కంటే దూకుడుగా విమర్శలు గుప్పించారు. దీంతో ఆమె తెలంగాణలో ఎవరు వదిలిన బాణం అన్న చర్చ అప్పట్లో విస్తృతంగా వచ్చింది. విపక్ష ఓట్లను చీల్చేందుకు జగన్ ఆశీస్సులతో కేసీఆర్ కోసం ఆమె తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేశారా అన్న అనుమానాలూ కూడా అప్పట్లో వ్యక్తం అయ్యాయి.

అయితే తరువాత తరువాత ఆమె సొంతంగా తెలంగాణలో రాజకీయ శక్తిగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోందని కూడా పరిశీలకులు విశ్లేషణలు చేశారు. అయితే ఎప్పుడైతే తన  వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి తహతహలాడారో అప్పుడే  తెలంగాణలో ఇక సొంత గుర్తింపు అన్న ప్రశ్నే లేకుండా పోయింది. అప్పటి వరకూ ఆమె నడిచిన రాజకీయ నడకకు అర్ధం లేకుండా పోయింది.  ఆమె కాంగ్రెస్ విలీనం అంశం తెరమీదకు రాగానే.. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. తెలంగాణలో ఆమె రాజకీయం చేస్తు అంగీకరించేది లేదని పార్టీ  సీనియర్లు కుండబద్దలు కొట్టేశారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి  కూడా ఎరుక పరిచారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే  తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకూ షర్మిల తెలంగాణలో రాజకీయం చేయడానికి అంగీకరించేది లేదని విస్ఫష్టంగా ప్రకటించారు. కావాలంటే  పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆమె ఏపీలో పని చేస్తే అభ్యంతరం లేదనీ, ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టినా స్వాగతిస్తానని తేల్చేశారు. ఇంకా వీహెచ్ వంటి సీనియర్లు కూడా షర్మిల తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో వైఎస్ షర్మిలకు ఏం పని అంటూ తీసి పారేశారు. 

అయితే హై కమాండ్ వైఎస్ ఇమేజ్ అంటూ షర్మిల కాంగ్రెస్ ప్రవేశానికి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే తెలంగాణ సెంటిమెంట్ కారణంగా ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఆమె ఏపీలో పని చేయాలన్న షరతు విధించారని కాంగ్రెస్ వర్గాలు అప్పట్లో చెప్పాయి. అయితే షర్మిల మాత్రం తన కార్యక్షేత్రం తెలంగాణ మాత్రమేనని పట్టుబట్టారని అంటున్నారు. ఒక దశలో ఆమె కాంగ్రెస్ ఏపీ ప్రతిపాదనను అంగీకరించినట్లు కనిపించినా.. అది తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ తో ఉన్న ఆస్తి పంపకాలను సెటిల్ చేసుకునేందుకేననీ, ఒక సారి అవి సెటిల్ అయిపోయిన తరువాత ఆమె తాను తెలంగాణకే పరిమితమౌతానని కాంగ్రెస్ హై కమాండ్ కు స్పష్టం చేయడంతో విలీనం ప్రక్రియకు తెరపడిందని అంటున్నారు. వైఎస్సార్టీపీ విలీనం వార్తలతో అప్పటిదాకా షర్మిల పార్టీకి అంతో కొంతో ఉన్న బలం కూడా ఆవిరైపోయింది. దీంతో ఆమె పార్టీ ప్రస్తుతం తెలంగాణలో  ఉనికి మాత్రంగానే మిగిలిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

దీంతో ఇప్పుడు ఆమె పార్టీ తరఫున పోటీకి అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితుల్లో పడ్డారు. తన  తల్లి విజయమ్మను కూడా రంగంలోకి దింపుతున్నారు. పాలేరు, లేదా సికిందరాబాద్ నియోజకవర్గాలలో ఏదో ఒక స్థానం నుంచి విజయమ్మ వైఎస్సార్టీపి అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక షర్మిల పాలేరు, మిర్యాలగూడలలో ఒక స్థానం నుంచి కానీ, రెండింటి నుంచి కానీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తం మీద షర్మిల పోటీ తెలంగాణలో నామమాత్రంగానే ఉంటుందనీ, తెలంగాణ ఎన్నికల అనంతరం మళ్లీ షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం ప్రతిపాదన తెరమీదకు వస్తుందనీ, అప్పుడు కూడా ఆమె వైఎస్ బ్రాండ్ తో ఏపీలో ప్రచార బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరిస్తేనే విలీనం ప్రతిపాదనకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయనీ లేకుంటే.. ఉనికి మాత్రపు పార్టీగా షర్మిల వైఎస్సార్టీపీ తెలంగాణలో కొనసాగాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

By
en-us Political News

  
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.