ఈసీ బదలీలలేనా?

Publish Date:Oct 12, 2023

Advertisement

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇలా ప్రకటించిందో లేదో అలా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎన్నికల బదలీల ప్రక్రియ ప్రారంభించేసింది. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తరువాత కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధులలో  బాధ్యతలు నిర్వహించే శాఖలను, యంత్రాంగాన్ని తన అధీనంలోకి తీసుకుంటుంది. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఒక అడుగు ముందే ఉంది. ఇలా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగానే అలా యంత్రాంగాన్ని తన అధీనంలోకి తీసుకోవడం ప్రారంభించింది. కీలక అధికారుల బదలీ చేసేసింది. 

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికలలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? అన్నదానితో సంబంధం లేకుండా ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. ఉండాలి కూడా. అయితే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని సర్కార్ కొలువు దీరిన నాటి నుంచి ఆ పరిస్థితి లేకుండా పోయింది. వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై ప్రజలలో ఎలా అయితే విశ్వసనీయత లేకుండా పోయిందో.. కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా అలాంటి అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. 2014లో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి సర్కర్ ఏర్పాటైంది. అప్పటి నుంచీ క్రమక్రమంగా కేంద్రం వ్యవస్థలపై ఆధిపత్యం సాధించే విధంగా పావులు కదుపుతూ వచ్చిందని అంటున్నారు. అధికారుల నియామకం నుంచి, బదలీల వరకూ అస్మదీయులకు పెద్ద పీట వేయడం మొదలైందని సోదాహరణంగా వివరిస్తున్నారు. అన్నిటికీ మించి అత్యంత కీలక స్థానాలలో  ఉన్న వారిలో అత్యథికులు ప్రధాని మోడీ స్వంత రాష్ట్రమైన  గుజరాత్ కు చెందిన వారే కొలువుదీరి ఉండడాన్ని చూపుతున్నారు. 

ఇక 2019 ఎన్నికలకు ముందు.. అంతకు ముందు వరకూ ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం ఆ కూటమి నుంచి బయటకు వచ్చింద. విభజన హామీలు నెరవేర్చే విషయంలో, మరీ ముఖ్యంగా రెవెన్యూలోటుతో బీద రాష్ట్రంగా మిగిలిన ఏపీకి అందించాల్సిన  సహకారం విషయంలో మోడీ సర్కార్ వైఖరితో విబేదించిన చంద్రబాబు.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారు. ఫలితం.. 2019 ఎన్నికలలో కేంద్రంలోని మోడీ సర్కార్ ఆయనను చక్రబంధం చేసేసిందని పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. 

2019లో ఎన్నికల కోడ్ రాగానే కేంద్ర ఎన్నికల సంఘం ఏపీపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. సీఎస్ సహా కీలక నేతలందరినీ బదలీ చేసేసింది. ఏ  అధికారీ  కూడా  చంద్రబాబు మాట వినని పరిస్థితిని క్రియోట్ చేసింది. చివరాఖరికి అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తన స్థాయిని కూడా పట్టించుకోకుండా డీజీపీ కార్యాలయానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారంటే బాబు ఓటమే లక్ష్యంగా బదలీలు, నియామకాలు ఎలా జరిగాయో అర్ధం అవుతుంది.  
అప్పట్లో పరిస్థితి అలా మారడానికి  చంద్రబాబు మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తో విభేదించడమే కారణమని అప్పట్లోనే  పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు మోడీతో విభేదించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇలా  షెడ్యూల్ విడుదల కాగానే అలా కీలక  అధికారులను ఎన్నికల సంఘం బదలీ చేయడమే నిదర్శనం అంటున్నారు.  సాధారణంగా అధికారుల అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తే కేంద్ర ఎన్నికల  సంఘం వాటిని పరిశీలించి  బదలీ  చేస్తుంది. కానీ 2019 ఎన్నికల సమయంలో ఏపీలోనూ, ఇప్పుడు 2023 తెలంగాణ ఎన్నికల సమయంలో తెలంగాణలోనూ కేంద్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులతో సంబంధం లేకుండానే.. బదలీలు చేసేసింది. తెలంగాణలో అయితే షెడ్యూల్ ప్రకటనకు ముందే ఎవరెవరిని బదిలీ చేయాలీ, ఎవరెవరిని ఎన్నికల విధుల్లో ఉండేలా చేయాలి అన్న  జాబితారెడీ చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా  ఉందా అన్న అనుమానాలు వ్యక్తం  అయ్యేలా తాజా బదలీలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

  నోటిఫికేషన్ విడుదల నాటికి మరిన్ని బదలీలు ఉంటాయన్న అంచనాలూ ఉన్నాయి. కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు యంత్రాంగం నుంచి ఎటువంటి సహాయ సహకారాలూ అందకుండా  చేయడమనే లక్ష్యంతో ఈ బదలీల  పర్వం ఉందన్న విమర్శలు అయితే ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎన్నికల  సమయంలో అధికార పార్టీకి యంత్రాంగం  నుంచి సహాయ  సహకారాలు అందకూడదనీ కీలక శాఖల ఉద్యోగులందరినీ ఎన్నికల సంఘం అధీనంలోకి తీసుకుంటుంది. అయితే ఈ విషయంలో పైస్థాయి రాజకీయ ఒత్తిడుల కారణంగా రాజకీయంగా ఎవరికో లబ్థి చేకూర్చాలన్నట్లుగా బదలీలు ఉన్నాయన్న అనుమానాలు తలెత్తేలా వ్యవహరించడం ఎంత మాత్రం సరికాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అలాంటి తీరు వల్ల ఎన్నికల సిస్టంపై జనాలలో నమ్మకం పోయే పరిస్థితి వస్తుందని అనుమానిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం బదలీల ప్రక్రియను ఒక్క తెలంగాణలోనే ఆరంభించడమేమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి  అనుకూలంగా వ్యవహరించే అధికారుల బదలీలను ఎవరూ తప్పు పట్టరు కానీ, వెస్టెడ్ ఇంట్రస్ట్ తో బదలీలను చేపట్టారన్న అనుమానాలు వ్యక్తం కాకుండా ఫిర్యాదులు, ప్రతిపాదనలూ వంటి వాటి జోలికి పోకుండా బదలీలు, నియామకాలు చేపట్టడంతోనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయని  అంటున్నారు. 2019 లో ఏపీలో ఏం జరిగిందో.. ఇప్పుడు 2023 ఎన్నికల సమయంలో తెలంగాణలో అదే జరుగుతోందని అంటున్నారు. 

By
en-us Political News

  
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.