విమానంలో డేంజర్ బెల్స్.. ఎమ్మెల్యే రోజా గుండె గుబేల్.. 

Publish Date:Dec 14, 2021

Advertisement

వైసీపీ ఫ్రైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ల్యాండింగ్ చేస్తే ప్రమాదం జరిగే ముప్పుందని గ్రహించిన పైలట్.. విమానాన్ని కిందకు దించలేదు. రాజమండ్రి నుంచి 9.20 గంటలకు తిరుపతికి బయల్దేరిన ఇండిగో విమానం.. 10.20 గంటలకు తిరుపతిలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించి అక్కడ ల్యాండ్ చేశారు. విమానంలో రోజాతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నారు.

విమానాన్ని ల్యాండ్ చేసినా డోర్లు మాత్రం తెరవలేదు. దీంతో 4 గంటల పాటు రోజా సహా ప్రయాణికులంతా విమానంలోనే చిక్కుకుపోయారు. దీనికి సంబంధించి రోజా వీడియోను కూడా విడుదల చేశారు. డోర్లు కూడా తెరవడం లేదని, తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని బెంగళూరులో దింపారని ఆమె అందులో తెలిపారు. గ్రౌండ్ లో పరిస్థితేంటో తెలియదని చెప్పారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసినా.. అక్కడ పర్మిషన్ ఉందో లేదో చెప్పట్లేదన్నారు. డోర్లు కూడా తెరవడం లేదని తెలిపారు. మబ్బులున్నాయని, కింద రన్ వే కనిపించడం లేదని ఫ్లైట్ లో అనౌన్స్ చేశారని, కానీ, అది సాంకేతిక సమస్యని బెంగళూరుకు వచ్చాకే తెలిసిందని ఆమె చెప్పారు. విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకే బెంగళూరుకు వచ్చామని ఫ్లైట్ అధికారులు చెప్పారన్నారు.

విమానంలో ప్రయాణికులు భయపడిపోతున్నారని, అరుస్తున్నారని రోజా చెప్పారు. చంపేస్తారా? అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను కిందకు దించేందుకు ఎయిర్ పోర్టు అధికారుల నుంచి ఇంకా తమకు ఆదేశాలు రాలేదని పైలట్లు చెబుతున్నారన్నారు. విమానంలో ఏదో పెద్ద సమస్యే వచ్చినట్టుందని ఆమె చెప్పారు. ట్రైన్లైనా, ఫ్లైట్స్ అయినా యాక్సిడెంట్లు అవుతాయన్న భయంతో ట్రావెల్ ను ఆపలేం కదా అని అన్నారు రోజా.  తనకిలా జరగడం ఇది రెండోసారన్నారు. అంతకుముందు హైదరాబాద్ లో విమానం టైర్ పేలిపోయి రాత్రి 10.40 గంటల సమయంలో ఇలాగే డోర్లు క్లోజ్ చేసి పెట్టారని గుర్తు చేశారు. 

ఇటీవలే తనకు మేజర్ ఆపరేషన్ అయిందని, ఒకే చోట నాలుగు గంటలు తాను కూర్చోలేనంటూ పైలట్ తో మాట్లాడానని ఆమె తెలిపారు. తన పొట్టకు 29 కుట్లు వేశారన్నారు. దాని వల్ల పొట్ట మీద భారం పడుతుందన్నారు.తనతో పాటు లావణ్య అనే తన కజిన్ విమానంలో ఉన్నారని చెప్పారు. చాలా నొప్పిగా, బాధగా ఉందని ఆమె పేర్కొన్నారు. మెడికల్ గ్రౌండ్ లో దింపుతామని, అయితే, దానిని చెక్ చేసేందుకు సంబంధిత అధికారులు రావాల్సి ఉందని ఫ్లైట్ అటెండెంట్ చెప్పారని తెలిపారు. అయితే విమానాన్ని ఎక్కడికి తీసుకెళ్తారన్న దానిపై స్పష్టత లేదని, వెనక్కు తీసుకెళ్తారా? వేరే విమానం అరెంజ్ చేస్తారా? అన్నది చెప్పట్లేదని తెలిపారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.