జగన్‌కు ఈనాడు డైలీ షాక్
Publish Date:Jan 21, 2012
Advertisement
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్‌లోకి పెద్ద యెత్తున నిధులను మళ్లించిన డొల్ల కంపెనీల వ్యవహారంపై రామోజీ రావు నేతృత్వంలోని ఈనాడు దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. సాక్షి దినపత్రికలోకి 22 డొల్ల కంపెనీల నుంచి నిధులు వచ్చాయని, వాటిలో 16 కంపెనీలకు ఒకరే డైరెక్టర్ ఉన్నట్లు బయపడిందని వెల్లడించింది. రామచంద్ర సింగ్ అనే వ్యక్తి సారథ్యంలోనే 16 కంపెనీలు ఏర్పాటైనట్లు బయటపడిందని ఈనాడు డైలీ తెలిపింది. ఈటీవీ కార్పొరేషన్లో డైరెక్టర్లుగా ఉన్నవారి పేర్లను కూడా ఈనాడు దినపత్రిక రాసింది. వైయస్ ప్రభుత్వం నుంచి మేళ్లు పొందిన వారి దగ్గర జరిపిన వసూళ్లను జగతిలోకి మళ్లించేందుకు కోల్కత్తా, ముంబై, గుజరాత్ కేంద్రాలుగా నమోదైన ఆ నెట్ వర్క్ కంపెనీలను వాడుకున్నట్లు తెలుస్తోందని ఈనాడు దిపనత్రిక అనుమానించింది.
కోల్కత్తా కంపెనీల నుంచి 2007లోనే జగతి పబ్లికేషన్‌లోకి నిధుల వరద ప్రారంభమైందంటూ ఎలా ఆ నిధులు ప్రవహించాయో ఈనాడు దినపత్రిక వివరించింది. ఆ కంపెనీల గుట్టును ఆదాయం పన్ను శాఖ విప్పిందని రాసింది. ఆ కంపెనీల పేర్లను కూడా ఈనాడు దినపత్రిక ఇచ్చింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టిన కంపెనీల షేర్లు ఆయా కంపెనీల పేరిట లేవని తెలిపింది. అవి ముంబైకి చెందిన అవంత్ గ్ర్డేడ్ ఫ్యాషన్‌వేర్, షావ్రతావ్ ఇండస్ట్రీస్, ఐఎ ండ్ ఐసి ప్రైవేట్ లిమిటెడ్ పేరిట బదిలీ అయినట్లు తెలిపింది. 22 కంపెనీల పేరిట ఉన్న షేర్లు చివరకు మూడు కంపెనీల పేరిటకు బదిలీ అయినట్లు ఈనాడు దినపత్రిక రాసింది.
http://www.teluguone.com/news/content/ysr-congress-party-24-11091.html





