సొంత ఇంటికి వెళ్ళారు ..తప్పేమి లేదు : బొత్స
Publish Date:Jan 21, 2012
Advertisement
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీకి చెందిన మంత్రులు గాంధీ భవన్‌కు రాకున్నా తప్పు లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొత్తగా చేసిన పీఆర్పీ నేతలు ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా ప్రజారాజ్యం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ చిరంజీవితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. దీనిపై పలువురు నేతలు కాంగ్రెస్ పరిశీలకుడు కృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు.ఈ సంఘటనపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పందిస్తూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పీఆర్పీ నేతలు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావు రాజ్‌భవన్ నుంచి నేరుగా పీఆర్పీ కార్యాలయానికి వెళ్ళడం, అక్కడ చిరంజీవితో కలిసి మీడియా సమావేశం నిర్వహించడంలో తప్పు లేదన్నారు. ఆ ఇద్దరు మంత్రులు సొంత ఇంటికి వెళ్ళారని, అందులో తప్పేమి లేదన్నారు. కాగా, కొత్త మంత్రులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావు తమ సహచర నేతలతో కలిసి గాంధీభవన్‌లో బొత్సను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రాధాన్యతలేని శాఖల కేటాయించిన విషయాన్ని వారు బొత్స దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
http://www.teluguone.com/news/content/prp-congress-24-11088.html





