బిగ్ బ్రేకింగ్.. వైసీపీకి విజయమ్మ రాజీనామా? 

Publish Date:Aug 31, 2021

Advertisement

వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు తీవ్రమయ్యాయా? వైఎస్సార్ వర్ధంతి రోజున సంచలనం జరగబోతోందా? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకాకిగా మిగలబోతున్నారా? అంటే.. వైఎస్ ఫ్యామిలీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో నిజమే అనిపిస్తోంది. వైఎస్సార్ కుటుంబంలో ఏదో జరగబోతుందనే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. జూలైలో  వైఎస్సార్ జయంతి రోజున ఇడుపులపాయకు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్లి నివాళులు అర్పించడం చర్చనీయాంశమైంది. గతంలో కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లి నివాళి అర్పించేవారు.అందుకు భిన్నంగా ఉదయం విజయమ్మ, షర్మిల వెళ్లగా.. ఎప్పుడు లేనట్టుగా సాయంత్రం వెళ్లి నివాళి అర్పించారు జగన్. 

తాజాగా సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్థంతి రోజున కూడా ఇడుపుల పాయలో అలాంటే సీనే కనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇడుపులపాయకు కుటుంబ సభ్యులందరితో  కాకుండా సీఎం జగన్ ప్రత్యేకంగా వెళుతున్నట్లు తెలుస్తోంది. అదే రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ఏపీ సీఎం జగన్ తల్లి అయిన విజయమ్మ హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం పెడుతుండటం మరింత ఆసక్తి రేపుతోంది. గతంలో వైఎస్సార్ తో కలిసి పని చేసిన నేతలు, ఆయన సన్నిహితులు, అప్పటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలను సమావేశానికి ఆహ్వానించారట విజయమ్మ. అయితే ఆ సమావేశానికి జగన్ కు మాత్రం ఆహ్వానం లేదట. దీంతో కొడుకు జగన్ తో సంబంధం లేకుండా వైఎస్సార్ వర్థంతి రోజున విజయమ్మ సమావేశం నిర్వహిస్తుండటంతో .. ఆ రోజున ఏదో జరగబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వ్యక్తుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో వైఎస్ విజయమ్మ ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్‌టీపీకి గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పెట్టిన కూతురు షర్మిలకు మొదటి నుంచి మద్దతుగా నిలిచారు విజయమ్మ. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన రోజు, ఖమ్మంలో జరిగిన తొలి సభలోనూ, పార్టీ పేరును అధికారికంగా ప్రకటించిన సభలోనూ  షర్మిల పక్కనే ఉన్నారు విజయమ్మ. కూతరు షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె  వేగంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా  సమావేశం పెట్టారని.. అక్కడే విజయమ్మ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వైసీపీకి గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి.. వైస్సాఆర్ టీపీ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నానని విజయమ్మ ప్రకటించవచ్చని అంటున్నారు. 

నిజానికి వైఎస్ షర్మిల పార్టీ సభకు విజయమ్మ హాజరైనప్పుడు ఆమెపై విమర్శలు వచ్చాయి. వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ.. మరో పార్టీ సభలో ఎలా పాల్గొంటారనే ప్రశ్నలు వచ్చాయి. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్న వైసీపీ నేతలు.. విజయమ్మ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ఎంపీ రఘురామ రాజు కూడా తీవ్రంగానే స్పందించారు. వైసీపీలో రెండు రకాల సిద్ధాంతాలు ఉంటాయా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో  వివాదానికి తెర దించాలంటే ఏదో ఒక పార్టీలో కొనసాగాలని విజయమ్మ భావించారట. సీఎం జగన్ తో విభేదాలు ఉండటంతో ఆమె కూతురు వైపే ఉండాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.  

వైఎస్ విజయమ్మ వైసీపీకి రాజీనామా చేస్తే అది ఏపీ రాజకీయాల్లో సంచనంగా మారడం ఖాయం. విజయమ్మ నిర్ణయం సీఎం జగన్ కు తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్ నిరంకుశ పాలన చేస్తున్నారని, ఎవరిని లెక్క చేయకుండా మోనార్క్ లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు విజయమ్మ వైసీపీకి రాజీనామా చేస్తే.. కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోవడం లేదని, జగన్ పై జరుగుతున్న ప్రచారం నిజమేనని జనాలు నమ్మే అవకాశం ఉంటుంది. విపక్షాలకు కూడా బ్రహ్మండమైన అస్త్రం దొరికినట్లే. చూడాలి మరీ ఏం జరగబోతుందో.. 

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.