రాజారెడ్డిని చంపిన వాళ్ల‌ను...టీడీపీ ఆఫీసులో దాచి పెట్టారా?

Publish Date:May 22, 2026

Advertisement

 

వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ  తెర‌పైకి. అస‌లీ కేసులో ఏం జ‌రిగింది? జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఇది కూడా ఆయ‌న దృష్టిలో  చంద్ర‌బాబు చేయించిన హ‌త్యేనా? ఈ కేసు ప్ర‌స్తుతం ఏ ద‌శ‌లో ఉంది? ఆ నాడు ఈ కేసులోని వారు ఇప్పుడు ఏమంటున్నారు? ఏమిటా వివ‌రాలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  రాజారెడ్డి హత్య కేసు  దశాబ్దాల నాటిదైనా, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు నేపథ్యం, జగన్ ఆరోపణలు, నిందితుల స్పందన, ప్రస్తుత స్థితికి అద్దం ప‌డుతోంది.
 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి, వైఎస్ జగన్ రెడ్డి తాత- వైఎస్ రాజారెడ్డి 1998 మే 23న కడప జిల్లా వేముల సమీపంలో బాంబు దాడిలో హత్యకు గురయ్యారు. పులివెందుల ప్రాంతంలో అప్పట్లో ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాల కార‌ణంగా ఈ ఘోరం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ప్రాంతీయ విభేదాలు, గనుల వ్యాపార వివాదాలు.. కీల‌కంగా ఉన్నాయని అప్పట్లో నిర్ధారించారు పోలీసులు.

జగన్ చెప్పినట్లు చంద్రబాబే చేయించారా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే..  ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. 1999 ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తన తాత రాజారెడ్డిని దారుణంగా చంపారని ఆరోపించారు జగన్. వైఎస్సార్‌ను పులివెందులకే పరిమితం చేయాలనే రాజకీయ కుట్రతోనే టీడీపీ ఈ హత్య చేయించిందని, హత్య చేసిన త‌ర్వాత‌ నిందితులను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో దాచిపెట్టి అధికార బలంతో రక్షించారని ప్రస్తావించారు జగన్.

తెలుగుదేశం పార్టీ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. రాజారెడ్డి హత్య పూర్తిగా కడప జిల్లాలోని స్థానిక ఫ్యాక్షన్, గనుల వివాదాల వల్ల జరిగిందని, దానికి పార్టీకి లేదా చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది.

న్యాయపరంగా చూస్తే ఈ కేసు ఎప్పుడో ముగిసిపోయింది. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు, నిందితులకు శిక్షలు కూడా విధించింది. రాజారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారికి కోర్టులు జీవిత ఖైదు శిక్ష విధించాయి. శిక్షా కాలం పూర్తి చేసుకుని,  చట్టపరమైన నిబంధనల ప్రకారం నిందితులు ఇప్పటికే జైలు నుంచి విడుదలయ్యారు. చట్టపరంగా ఈ కేసు ముగిసినప్పటికీ, రాజకీయంగా మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి దీన్ని వాడుకుంటున్నారు.

ఆ నాడు ఈ కేసులో నిందితులుగా  ఉన్న‌ వారు ఇప్పుడు ఏమంటున్నారు? అని గ‌మ‌నిస్తే.. జగన్ వ్యాఖ్యలపై ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, శిక్ష అనుభవించి విడుదలైన పార్థసారథిరెడ్డి కడపలో మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు.  జగన్ చేసిన ఆరోపణలను పార్థసారథిరెడ్డి పూర్తిగా తిప్పికొట్టారు.  నీ తాత రాజారెడ్డి  మనుషులు నన్ను ఎలా నరికారో, అలాగే నా వర్గీయులు మీ తాతను నరికారు. 

అది ఫ్యాక్షన్ గొడవ  అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. తాను ఎంతో మంచి వాడిన‌ని చెప్పుకుంటున్న జ‌గ‌న్ ఒక న‌ర‌రూప రాక్ష‌సుడ‌ని.. తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డ‌ని వ్యాఖ్యానించారాయ‌న‌.గతంలో వైఎస్సార్‌ కుటుంబం తన అంగబలాన్ని, ఆర్థిక బలాన్ని దెబ్బతీసి ఎన్నో చిత్ర‌ హింసలకు గురిచేసిందని, మంగలి కృష్ణ అనే వ్యక్తితో కలిసి.. తనపై సూట్‌కేస్ బాంబు దాడి చేయించి చంపాలని చూశారని ఆరోపించారు పార్థసారథిరెడ్డి.

తమపై కక్ష సాధింపు చర్యలు జరిగాయని, తాము ఎన్నో పోరాటాలు చేసి నిలబడ్డామని, జగన్ తమకు ఎలాంటి ప్రాణభిక్ష పెట్టలేదని ఆయన మండిపడ్డారు.రాజారెడ్డి హత్య అనేది 1998లో జరిగిన ఒక ఫ్యాక్షన్ ఉదంతం. న్యాయస్థానాలు దీనిపై తీర్పునిచ్చి ఎప్పుడో కేసు క్లోజ్ అయినప్పటికీ, ఏపీలో వైసీపీ-టీడీపీ మధ్య నడుస్తున్న  హత్యా రాజకీయాల  సవాల్-ప్రతిసవాళ్లలో భాగంగా ఈ పాత కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అంతే  కాదు గొడ్డ‌లి  పార్టీ అంటూ చంద్ర‌బాబు జ‌గ‌న్ పార్టీని అన‌డంతో అస‌లీ గొడ‌వంతా  మొద‌లైంది. ఎవ‌రిది క్రిమిన‌ల్ బ్రైన్? అంటూ జ‌గ‌న్ పాత కాల‌పు కేసుల‌న్నిటినీ  తిర‌గ‌దోడారు. అందులో భాగంగా ఇదంతా మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.
 

By
en-us Political News

  
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ కూడా ఇలాంటి ఆహార్యాన్ని ఎంచుకోలేదు.నల్లకొటు ధరించే ఏకైక ముఖ్యమంత్రి విజయ్ అనడంలో సందేహం లేదు. సీఎంలు, ప్రముఖ పొలిటీషియన్లు ధరించే సాధారణ చొక్కాలు, ప్యాంట్లు మొనాటనీ అయిపోయి జనం వాటిని పట్టించుకోవడమే మానేశారని చెప్పొచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.