జగన్ జుట్టు బాగా అందించాడు..!
Publish Date:Aug 5, 2017
Advertisement
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ నంద్యాల చుట్టూనే తిరుగుతున్నాయి. దివంగత భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల స్థానాన్ని తమ ఖాతాలోకి వేసుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో యుద్దానికి రెడీ అయ్యాయి. నిన్న మొన్నటి వరకు సో..సోగా ఉన్న నంద్యాల రాజకీయం..జగన్ బహిరంగసభతో హిటెక్కింది. అన్ని రకాల సర్వేల్లోనూ ఇరు పక్షాలకు ఫిఫ్టీ..ఫిఫ్టీ ఛాన్సులున్నట్లు తేలింది. నంద్యాల నడిబొడ్డున జగన్ మోగించిన నగారా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని..ఫుల్ జోష్‌లో ఉన్న కార్యకర్తలు విజయం తమదేనని జబ్బలు చరుస్తున్న వేళ జగన్ నోటీదురుసు ఆ ఉత్సాహన్ని నీరు గార్చింది. అంతేనా నంద్యాల ప్రభావం రాష్ట్రం మీద పడకుండా చేయడానికి టీడీపీకి మంచి అవకాశం దొరికింది. 21 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్నప్పుడు గానీ, కోర్టు నోటీసులు ఇచ్చినా గానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించడానికి చంద్రబాబు వెనుకాడుతున్నాడని జగన్ ఆరోపించారు. అక్కడితో ఆగితే ఏ సమస్యా ఉండేది కాదు కానీ చంద్రబాబుని నడి రోడ్డు మీద కాల్చాలని జనానికి పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూసిన అధికారపక్షానికి జగన్ చేసిన వ్యాఖ్యలు అవకాశం కల్పించాయి. లక్షలాది మంది ప్రజల సాక్షిగా, మీడియా సాక్షిగా ఒక ముఖ్యమంత్రి మీద ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం జగన్ అనుభవలేమికి ఉదాహరణగా నిలుస్తుందంటూ టీడీపీ నేతలు ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. అదొక్కటే కాకుండా తెలుగు తమ్ముళ్లు రాష్ట్రమంతటా రోడ్డెక్కడం, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం వంటి చర్యల ద్వారా ప్రజల్లో ఫ్యాన్ పార్టీని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను ఒక కంట గమనిస్తున్న వైసీపీ శ్రేణులు...తమ అధినేత వైఖరిని చూసి నవ్వాలో, ఎడవాలో తెలియని పరిస్థితిలో జుట్టు పీక్కొంటున్నారు. చూస్తుంటే చేతి దాకా వచ్చింది నోటి దాకా వస్తుందా అని భయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/ys-jaganmohan-reddy-45-76843.html





