అనంతపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసైనికులతో కవాతు నిర్వహించారు. గుత్తి రోడ్డులోని మార్కెట్‌యార్డు నుంచి సప్తగిరి సర్కిల్ వరకు యువతతో భారీ ర్యాలీగా వెళ్లారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ప్రధానంగా టీడీపీ, వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సీఎం కావాలని తానెప్పుడూ కలలు కనలేదన్నారు. రాజ్యాంగం తనకు ఆ అవకాశం కల్పించే సమయమొచ్చిందని చెప్పారు. జగన్ తనకు శత్రువూ కాదని, సీఎం చంద్రబాబు మిత్రుడూ కాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో మనల్ని ఏ కులమో, ఏ మతమో అని చూడకుండా ఆంధ్రులుగా చూసి తెలంగాణ నుంచి తన్ని తరిమేశారని అన్నారు. ఏపీ ప్రజలను తెలంగాణ నాయకులు దోపిడీదారులుగా చిత్రీకరించారన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు ఎన్నికల పనిమీద హైదరాబాద్‌లో ఉన్నారని, పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి రావాల్సిన కర్మ ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. ఇవన్నీ ప్రశ్నించాల్సిన జగన్ ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ నేరాలు చేశాడు. ఎప్పటికైనా లాలూప్రసాద్ యాదవ్‌లా జైలుకే వెళ్తాడు అని విమర్శించారు.
అప్పట్లో చంద్రబాబు జనసేన సాయం అడిగారు. నేనేమీ ఆశించకుండా సహకరించా. రాష్ట్రాన్ని అవినీతిరహితంగా ఉంచాలని ఆయన్ను కోరా. నోట్లో వెన్నముద్ద పెట్టినా కొరకలేడని చెప్పే మంత్రి లోకేష్ రాష్ట్రంలో ఇసుకను మింగేశారు. 2016లో అమరావతి రాజధాని నిర్మాణానికి భూముల కోల్పోతున్న రైతుల తరఫున చంద్రబాబును కలిసి భూసేకరణను ఆపాలని కోరాను. అప్పట్లో రెడ్డి సామాజిక వర్గ రైతులకు జగన్ గుర్తుకు రాలేదు. పవన్ గుర్తుకొచ్చాడు. మళ్లీ ఇప్పుడు భూసేకరణ ప్రక్రియ సాగిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు నా వద్ద ఆధారాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అధికారంలోకి రావు. 2019 నుంచీ 2021 వరకూ సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి. యుద్ధానికి యువత సన్నద్ధంగా ఉండాలి అన్నారు.
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ నా గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. విజయనగరం వచ్చి ఆయన సంగతి తేలుస్తా. నేనేమంత మంచివాడిని కాదు అని హెచ్చరించారు. పవన్ బీజేపీకి వత్తాసు పలుకుతున్నాడని చంద్రబాబు, లోకేష్ అంటున్నారు. నేనెప్పుడూ బీజేపీకి, మోదీకి భయపడను. ఆయన మహా అయితే కేసులు పెట్టి జైల్లో పెడతారు. మోదీ అంటే జగన్‌తోపాటు చంద్రబాబు, లోకేష్ కూ భయమే. వారంతా పాత దొంగలు. అందుకే భయపడుతున్నారు అని విమర్శించారు. రాష్ట్రంలో ముగ్గురే నాయకులున్నారు. వారిలో అసెంబ్లీకి వెళ్లకుండా పారిపోయిన జగన్ ఒకరయితే మళ్లీ తనకు అధికారం ఇవ్వాలని అడిగే చంద్రబాబు మరొకరు. ఓట్లు వేయకపోయినా ప్రజలకు అండగా ఉంటానని చెప్పే పవన్ ఇంకొకరు. పంచాయతీ ప్రెసిడెంటు కూడా కాకుండా కొందరు సీఎం కావాలనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోయకపోతే మాది జనసేన పార్టీయే కాదు. జనసేన అధికారంలోకి వస్తే విదేశీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పరుగెత్తుకొస్తారు. సీఎం, లోకేష్ మాదిరిగా నేను లంచాలడగను అని పవన్ విమర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-will-go-to-jail-like-lalu-says-pawan-kalyan-39-84673.html
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.