సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరపాలి..జగన్ డిమాండ్

Publish Date:Jun 18, 2026

Advertisement

 

విజయవాడలో సాయికృష్ణ తల్లిని పరామర్మించిన వైఎస్ జగన్... 

విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం, మృతి వ్యవహారంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన విజయవాడ కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసానికి చేరుకుని, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని ఓదార్చిన జగన్, ఈ దారుణ ఘటనపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలని గట్టిగా డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డ వైఎస్ జగన్, పోలీసుల వేధింపుల వల్లే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు. ఒక సాధారణ యువకుడిని మే నెలలోనే పోలీసులు తీసుకువెళ్లారని, అతని ఆచూకీ కోసం తల్లి ప్రతిరోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కనీస సమాచారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పైగా, "నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో" అంటూ పోలీసులు అమానవీయంగా సమాధానం చెప్పడం అత్యంత దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసులో కేవలం కింది స్థాయి సిబ్బంది పాత్రే కాకుండా, పోలీసు ఉన్నతాధికారుల అండదండలు కూడా ఉన్నాయనే అనుమానాలను వైఎస్ జగన్ వ్యక్తపరిచారు. విజయవాడ సీపీ, ఏసీపీలతో పాటు డీజీపీకి కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. కృష్ణలంక ప్రాంతంలో పోలీసుల అరాచకాలు హద్దులు దాటాయని, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలోనూ ఇలాంటి వేధింపుల ఉదంతాలు వెలుగుచూశాయని జగన్ గుర్తుచేశారు. సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్ అనే మరో యువకుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడని, ఒకే అధికారి వల్ల ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు రావాలన్నారు. పోలీసుల లాకప్ డెత్ లపై ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఈ ఉదంతంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.  యువకుడిని లాకప్‌లో కొట్టి చంపారనే ఆరోపణలపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని తదితరులు ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచారు. హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ నేపథ్యంలో.. జూన్ 29 లోగా సాయికృష్ణను న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సి ఉండటంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠ రేపుతోంది.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సీఐ నాగరాజును సస్పెండ్ చేసి, సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణకు ఆదేశించినప్పటికీ, విపక్షాలు మాత్రం దీనిని సరిపెట్టుకోవడం లేదు. ఈ కేసులో నిజాలు పూర్తిగా నిగ్గుతేలాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థతోనే విచారణ సాధ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలు, ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపైనే అందరి దృష్టి నెలకొంది.

బాధిత తల్లి ఆవేదనను పూర్తిగా విన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ కేసులో వైఎస్సార్సీపీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికార బలంతో తప్పులను కప్పిపుచ్చాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన పోలీసు అధికారులపై మరియు వెనకుండి నడిపించిన రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఒక యువకుడి ప్రాణం పోవడం మరియు పోలీస్ స్టేషన్ లోనే హత్య జరిగిందనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని జగన్ విమర్శించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తాము పోరాటం ఆపేది లేదని, ఈ కేసును అన్ని వేదికలపై గట్టిగా వినిపిస్తామని  జగన్ స్పష్టం చేశారు.
 

By
en-us Political News

  
2027 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరో తేల్చేసిన సునీల్ గవాస్కర్. అఫ్గానిస్తాన్‌పై 79 బంతుల్లో 125 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌పై ప్రశంసలు.
భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే బేర్ నకిల్ ఫైటింగ్ రింగ్ లోకి వచ్చి తేల్చుకోవాలని, మలయాళీలు, సర్దార్ల గౌరవార్థం రావాలంటూ చేసిన వ్యాఖ్యల వైరల్ వీడియో వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్‌కప్ 2026 లో ఇరాక్‌పై నార్వే 4 1 తేడాతో గెలిచినందుకు ఆ దేశ పార్లమెంట్ సభ్యులు రాజకీయాలు పక్కనబెట్టి వైకింగ్ రోయింగ్ సెలబ్రేషన్స్ చేశారు. చట్టసభను ఊపేసిన ఆ క్రేజీ వైరల్ వీడియో విశేషాలు ఇక్కడ చూడండి.
ఈపీఎఫ్ఓ (EPFO) చందాదారులకు భారీ అప్‌డేట్. ఈ నెలాఖరు నుండి యూపీఐ, ఏటీఎంల ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే సరికొత్త సౌకర్యం రాబోతోంది. దీనితో పాటు 8.25 శాతం వడ్డీ జమ కానుంది. సర్వర్ బ్లాక్‌అవుట్ వివరాలు ఇక్కడ చూడండి.
టర్టిల్ మింట్ (Turtlemint) ఐపీఓ జూన్ 19న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమైంది. షేరు ధర144 152, ప్రస్తుత గ్రే మార్కెట్ ప్రీమియం GMP , బ్రోకరేజ్ సంస్థల రివ్యూలు, కంపెనీ ఆర్థిక నివేదికలు మరియు మీరు పెట్టుబడి పెట్టాలా వద్దా అనే పూర్తి విశ్లేషణను ఇక్కడ చదవండి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం పర్యటన నేపథ్యంలో నేడు సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బషీర్‌బాగ్, నాంపల్లి, లిబర్టీ రూట్లలో ప్రయాణించే వారు ఈ ప్రత్యామ్నాయ మార్గాలు మరియు రూట్ మ్యాప్ వివరాలు తప్పక తెలుసుకోండి.
న్యూయార్క్ నిక్స్ బాస్కెట్‌బాల్ జట్టు ఏకంగా 53 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రతిష్టాత్మకమైన బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడంతో లోయర్ మాన్‌హట్టన్ ప్రాంతంలో నగర చరిత్రలోనే నిలిచిపోయేలా ఒక భారీ విజయోత్సవ పరేడ్‌ను నిర్వహించారు. ఈ చారిత్రాత్మక విజయంతో అభిమానులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.
ఇందు కోసం ఏకంగా రుషికొండకు బోడి గుండు కొట్టించారు. 12 బెడ్ రూములు, ఒక్కో బెడ్ రూమ్ కూ అటాచ్ బాత్రూం, అత్యంత ఖరీదైన ఫర్నీచర్.. మళ్లీ అధికారం తనదేనన్న నమ్మకంతో తన కోసం జగన్ నిర్మించుకున్న ఈ ప్యాలెస్ కోసం గతంలో నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను కూలగొట్టారు. రిసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారు
కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో, వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలతో తమ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చారు. ఎండలు తీవ్రంగా ఉండి వర్షాలు పడనప్పుడు కప్పలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపిస్తే వరుణ దేవుడు తప్పకుండా కరుణిస్తాడని ఇక్కడి ప్రజల విశ్వాసం.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరాన్ని వరుణుడు పలకరించాడు.
ఎల్‌బీ నగర్ ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.