జగన్ సెక్యూరిటీలో సొంత సైన్యం... క్యాడర్ కోసమే అంటున్న నేతలు

Publish Date:Aug 4, 2025

Advertisement

 

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది. ఇప్పటికే పదిమంది రిటైర్డ్ ఆర్మీని జగన్ పెట్టుకున్నారు. అలాగే జెడ్ ప్లస్ కేటగిరి లో 58 మంది సిబ్బంది తో రాష్ట్ర ప్రభుత్వం జగన్ కు భద్రత ఏర్పాటు చేస్తోంది. జగన్ సెక్యూరిటీలో మార్పులు ఎల్లుండి డోన్ పర్యటన నుంచి అందుబాటులోకి రానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. 

అయితే జగన్‌పై ఎవరైనా దాడి చేస్తారన్న నేపథ్యంలో కాకుండా.. వైసీపీ కార్యకర్తల దృష్ట్యా సెక్యూరిటీ పెంచినట్లు తెలుస్తొంది. అయితే జనగ్ పర్యటనల్లో వైసీపీ కార్యకర్తలు ఆయన దగ్గరకు ఎక్కువ సంఖ్యాలో రావడంతో.. కార్యకర్తల భద్రత దృష్ట్యా సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ సెక్యూరిటీ జగన్ పర్యటనల్లో ఎలాంటి వివాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటుందని వైసీపీ అభిప్రాయ పడుతుంది.

మరోవైపు జగన్ పర్యటనల్లో టీడీపీ ప్రభుత్వం సరైనా శాంతిభద్రత కలిగించక పోవడం వల్లే సొంత సెక్యూరిటీని నియమించున్నామని వైసీపీ నాయకులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం జగన్‌కు సెక్యూరిటీ ఇవ్వడంలో ఫేల్ అవుతోందని విమర్శిస్తున్నారు. అయితే.. జగన్ ఇది వరకు చేసిన పర్యటనల్లో హెలిప్యాడ్ పై వైసీపీ కార్యకర్తలు పడి ధ్వంసం చేయడం, రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద వైసీపీ కార్యకర్త పడి చనిపోవడం వంటి అంశాల దృష్ట్యా జగన్ కు వైసీపీ అధిష్టానం ప్రైవేట్ సెక్యూరిటీ నియమించినట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.