Publish Date:Feb 25, 2012
హైదరాబాద్: జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లుగా మాధవ్ రామచంద్రన్ సిబిఐ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తన వద్ద ఉన్న సొమ్మే కాక స్నేహితుడి వద్ద రుణంగా రూ.10 కోట్ల దాకా తీసుకొని జగతిలో పెట్టుబడులు పెట్టినట్లుగా చెప్పారని తెలుస్తోంది. ఆ తర్వాత తన పెట్టుబడిని వెనక్కి ఇవ్వమని కోరినా స్పందించక పోవడంతో తాను మోసపోయానని తెలుసుకున్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గతంలో దుబాయ్ వెళ్లినప్పుడు అక్కడ కలిసిన తనను జగతిలో పెట్టుబడులు పెట్టమని చెప్పినట్లుగా ఆయన వాంగ్మూలంలో ఉన్నదని తెలుస్తోంది. కాగా ఎ.కె.దండమూడి వ్యక్తిగత హోదాలు రూ.5 కోట్లు పెట్టుబడులు పెట్టారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో వీరిద్దరినీ నిందితుల జాబితాలో చేర్చింది. దండమూడిని ఇదివరకే సిబిఐ అధికారులు పలుమార్లు విచారించారు. మాధవ్ రామచంద్రన్ బెంగళూరుకు చెందిన ప్రవాస భారతీయుడు. ఆయన దుబాయ్ లో ఉంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-24-12177.html
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో సోమవారం నాడు అసాధారణ వాతావరణం నెలకొంది.
తెలంగాణలో ధరణి, భూభారతి భూ రికార్డుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కొడంగల్ నివాసంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.!
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష విధించింది.
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!