Publish Date:Feb 25, 2012
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కీలక నిందితుడు కోనేరు ప్రసాద్ కు సిబిఐ కోర్టు షాకిచ్చింది. కోనేరు బెయిల్ పిటిషన్ ను మూడోసారి సిబిఐ కోర్టు కొట్టివేసింది. అటు ఇదే కేసులో నిందితుడు విజయరాఘవన్ సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలుచేశాడు. ఈ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోనేరు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలాని వాదనలు వినిపించారు. ఎమ్మార్ కేవలం అర్దిక నేరం మాత్రమేనని, వేల కోట్ల స్కాం 2జీ లో నిందితులకు బెయిల్ ఇచ్చారని, అలాంటప్పుడు తన క్లయింట్ కు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.
ఈ కేసులో ఇప్పటికే చార్జీషీట్ దాఖలుచేసినందున బెయిల్ ఇవ్వాలని కోరారు. కోర్టు ఏ షరతులు విధించినా సిద్దమేనని, విచారణకు పూర్తిగా సహాకరిస్తాడని తెలిపారు. రాంజెఠ్మలాని వాదనలపై సిబిఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దశలో నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్షాలను తారుమారు చేసే ప్రమాదముందని, తదుపరి దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సిబిఐ లాయర్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కోనేరు బెయిల్ ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయన మరికొన్ని రోజులు జైలు లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/emmar-properties-24-12174.html
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో సోమవారం నాడు అసాధారణ వాతావరణం నెలకొంది.
తెలంగాణలో ధరణి, భూభారతి భూ రికార్డుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కొడంగల్ నివాసంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.!
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష విధించింది.
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!