జగన్ పట్ల కిరణ్ కుమార్ మెతక వైఖరి
Publish Date:Feb 8, 2012
Advertisement
హైదరాబాద్: వైయస్ జగన్ పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెతక వైఖరి అవలంబిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. జగన్ ను విమర్శించేవారిని కిరణ్ కుమార్ దూరం పెడుతున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్పై కేసు వేసి, మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, మోపిదేవి వెంకటరమణల అవినీతిని ప్రశ్నించిన పి. శంకరరావును మంత్రి వర్గం నుంచి తొలగించారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవినీతి గురించి మాట్లాడే మంత్రులను ముఖ్యమంత్రి దూరం పెడుతున్నారని ఆయన అన్నారు. ఆరోగ్య శాఖలో అవినీతిని బయటపెడుతానని చెప్పిన డిఎల్ రవీంద్రా రెడ్డిని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తదితరులు బతిమిలాడుతున్నారని ఆయన అన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, లేదంటే ముఖ్యమంత్రికి కూడా వాటా ఉందని భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఆరోపణలు నిర్ధారణ అయిన మోపిదేవి వెంకటరమణతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరపడం సరి కాదని ఆయన అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి ఎసిబి దాడులను కిరణ్ కుమార్ రెడ్డి వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి పోటీ పడుతున్నారని చెప్పి ఎసిబి దాడులను బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా వాడుతున్నారని ఆయన అన్నారు.
http://www.teluguone.com/news/content/ys-jagan-24-11717.html





