విడాకుల సెటిల్మెంట్ కు డబ్బులు లేక యువకుడు ఆత్మహత్య

Publish Date:Jun 8, 2026

Advertisement

రెండేళ్ల క్రితం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఓ యువకుడు, తన వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జీవిత భాగస్వామి తో ఆనందంగా జీవించాలని కలలు కన్నాడు. అయితే పెళ్లైన కొద్ది నెలలకే భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. క్రమంగా ఆ గొడవలు తీవ్రరూపం దాల్చి..  చివరకు విడాకుల వరకు వెళ్లాయి. చివరకు యువకుడి ఆత్మహత్యతో ఈ కుటుంబ వివాదం విషాదకరంగా ముగిసింది.

ఈ విషాదకర మైన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి   దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు... అనంతరం పెద్దమనుషుల సమక్షంలో ఇరువర్గాల మధ్య పలుమార్లు రాజీ చర్చలు జరిగాయి. చివరకు కొంత మొత్తం చెల్లించి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని పెద్దలు నిర్ణయించారు.

అయితే సెటిల్మెంట్ కోసం అవసరమైన డబ్బును సమకూర్చుకోవడానికి  జాకబ్ నానా తంతాలు పడ్డాడు..డబ్బుల కోసం తెలిసిన వారి వద్ద అప్పుకు కూడా ప్రయత్నాలు చేశాడు.కానీ ఎవ్వరి దగ్గర నుండి సహాయం అందకపో వడంతో తీవ్ర మనస్థాపానికి గురైన జాకబ్, చివరకు ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు..కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జాకబ్ మృతికి దారితీసిన పరిస్థితులు, కుటుంబ వివాదాల నేపథ్యం, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది.

By
en-us Political News

  
తన వయస్సు 15 సంవత్సరాలు మాత్రమేననీ, ఇతరుల వల్ల ప్రభావితమై ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశాననీ పేర్కొంటూ.. క్షమాపణ కోరింది. ఆ క్షమాపణ వీడియోలో అదే తన తొలి తప్పనీ, అలాగే చివరి తప్పుకూడాననీ చెబుతూ.. క్షమించాల్సిందిగా వేడుకుంది.
మామతో బైక్‌పై వెళ్లి లారీ కిందపడిన చిన్నారి..
విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన రౌడీషీటర్ సాయికృష్ణ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది.
కర్ణాటక వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి.
యూసఫ్ గూడలో కారు బీభత్సం..ఇద్దరికి తీవ్ర గాయాలు..!
తెలుగు రాష్ట్రాల్లో అనధికారిక చిట్టీల పేరుతో మోసాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.
స్నేహబంధానికి ప్రతీకగా నిలిచే ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు ఒకే కుటుంబంలో ఆరని శోకాన్ని మిగిల్చాయి.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్..!
ఆంధ్రప్రదేశ్- ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
దక్షిణ అమెరికా దేశమైన పెరూలో ఆదివారం ఉదయం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనార్..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.