నేనే రాజు... నువ్వే మంత్రి.. ప్రతి చోటా జగన్ ఇదే కథ!

Publish Date:Sep 6, 2022

Advertisement

మళ్లీ అధికారం అందుకోవాలంటే... ఏం చేయాలో.. ఎలా చేయాలో.. ఎంత చేయాలో  ఫ్యాన్ పార్టీ శాశ్వత అధినేత, ముఖ్యమంత్రి జగన్   బాగా వంట పట్టించుకొన్నారు. ఈ విషయాన్ని సొంత పార్టీ నేతలే పదే పదే చెబుతున్నారు.  ఎక్కడికెళ్లినా జగన్ ది ఒక పాట, ఒకే రాగం. ఒకే పాట. ఆయన ఆవు కథ లెక్కడ పదే పదే చెబుతున్న 175కి 175 స్థానాలు అన్న మాట వినలేక, విని జీర్ణించుకోలేక వైసీపీ లీడర్ల నుంచి క్యాడర్ వరకూ తలలు గోడకేసి చేతులను నోటి కేసి తెగ కొట్టేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ వీక్‌గా ఉంటే..ఆ నియోజకవర్గ   పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై.. గెలిస్తే నువ్వే మంత్రి అని సదరు పార్టీ ఇన్ చార్జీతో.. గెలిపిస్తే మీ నాయకుడికి కేబినెట్ లో చోటు అంటూ వారి వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేసేందుకు వైయస్ జగన్ ఏ మాత్రం వెనకాడడం లేదు.

  టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి భరత్‌ను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే.. ఆయనకు మంత్రిగిరి ఇచ్చేస్తానంటూ  ఇటీవల ప్రకటించేశారు జగన్. అలాగే ఉత్తరాంధ్రలోని రాజాంలో కంబాల జోగులును గెలిపిస్తే.. ఆయనకు మంత్రి పదవి ఖాయమంటూ అంటూ ఆ  నియోజకవర్గంలోని పార్టీ వారిని ఊరించేశారు. ఇలా అయితే జగన్ 175 నియోజక వర్గాలలోనూ ఇదే మాట చెప్పాల్సి ఉంటుందనీ, ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ ఆఖరికి పులివెందులతో సహా పార్టీ వీక్ గానే ఉందని విపక్షాలు జగన్ తీరును ఎద్దేవా చేస్తున్నారు. ఎక్కడికెడితే అక్కడ మీ నాయకుడికి కేబినెట్ లో సీట్ గ్యారంటీ అంటూ జగన్ చెబుతుండటంతో  పార్టీ క్యాడర్ కూడా సీఎం మాటలను సీరియస్ గా తీసుకోని పరిస్థితి ఉంది.

 2019 ఎన్నికలకు ముందుకు వైయస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో అయితేనేమీ..  ఎన్నికల ప్రచారంలో అయితేనేమీ.. హామీలు వాగ్దానాలతో ఉదరగొట్టి పడేశారు. ఆ క్రమంలో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేశ్‌పై ఫ్యాన్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణరెడ్డిని గెలిపిస్తే.. తన ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అంటూ మంగళగిరి  ప్రజల సాక్షిగానే కాదు.. అక్కేడ స్థానికంగా కొలువైన పానకాల స్వామి వారి సాక్షిగా కూడా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే  ఆ తరువాత ఏం జరిగిందన్నది తెలిసిందే.  పార్టీలో ఆళ్ల రామకృష్ణారెడ్డి సీనియర్ అయినా.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో.. అదీ టీడీపీ నుంచి జంప్ కొట్టి.. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన విడదల రజినీకి... జగన్ తన మలి కేబినెట్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా స్థానం కల్పించారు.

ఈ అంశంపై అప్పడే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి.. తన అనుచరుల వద్ద సీఎం జగన్‌ వ్యవహారశైలిపై  అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన అనుచరులే చెబుతున్నారు.  ఆ  కారణంగానే  ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటించారని కూడా ఆయన అనుచరులు చెబుతున్నారు. అలాగే గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం నుంచి జంప్ చేసి వైసీపీ గూటికి చేరిన విడదల రజనిని చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలిపిస్తే  ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానంటూ నాడు ఆ సదరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్‌కు జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆ తరువాత జగన్ విస్మరించిన విషయాన్ని ఇప్పుడు పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.   

ఏదీ ఏమైనా... ఎన్నికల ప్రచారం వరకు ఫ్యాన్ పార్టీ అధినేతగా.. నేనే రాజు.. మీరు గెలిపిస్తే.. మీ నాయకుడే మంత్రి అంటూ.. ఉరించి  ఆ తర్వాత  కన్వీనియెంట్ గా విస్మరించడం జగన్ కు అలవాటేనని వైసీపీ శ్రేణులు అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేసుకుంటున్నారు. అంతెందుకు తాను  2019 ఎన్నికలలో సీఎం కావడం కోసం  నిర్విరామంగా కృషి చేసిన   చెల్లి,తల్లిని పూర్తిగా పక్కన పెట్టి వారు విసిగి పక్కరాష్ట్రానికి వలస వెళ్లిపోయేలా చేసిన జగన్ ఇప్పుడు గెలిపిస్తే మంత్రి పదవి అంటూ చెప్పిన మాటలను ఎంత సేపు గుర్తుంచుకుంటారులే అని లైట్ గా తీసుకుంటున్నారు.  ఏదీ ఏమైనా.. అధికారమనే అందలం ఎక్క వరకే .. తల్లి అయినా.. చెల్లి అయినా.. ఆ తర్వాత.. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అని ఫ్యాన్ పార్టీలోని వర్గాలే ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ వ్యవహార శైలిపై ముచ్చటగా ముచ్చటించుకోవడం మహా విశేషం.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.