రుషికొండ బీచ్ కు ఎంట్రీ ఫీ.. వైసీపీ యూటర్న్!

Publish Date:Jul 10, 2023

Advertisement

అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నది సామెత. జగన్ సర్కార్ కు చాలా విషయాలలో ఈ సామెత అస్సలు వర్తించది. ఇక తప్పదనుకున్నప్పుడో, మరో గత్యంతరం లేని సందర్బంలో మాత్రమే తాను చేసిన తప్పును దిద్దుకుంటున్నట్లుగా కలర్ ఇస్తుంది. జగన్ సర్కార్. జగన్ సర్కార్ అంటే అదేదో కేబినెట్ సమష్టిగా చేసే పాలన అనుకుంటే ఎవరైనా సరే తప్పులో కాలేసినట్లే అవుతుంది.

జగన్ సర్కార్ లో మంత్రులంతా తమ అధినేత, ముఖ్యమంత్రి ఏం అనుకుంటే అదే చేస్తారు. ఆయన మనసు గ్రహించి మసులు కుంటారు. ఇక ప్రభుత్వాధికారుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా.. జగన్ చెప్పిందే వారికి వేదం. అందుకే రుషి కొండకు గుండు కొట్టేసినా, హోటల్ పేరుతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించమన్నా.. నిబంధనలు అంగీకరించవనీ, పర్యావరణ సమస్యలు వస్తాయనీ అన్న విషయాన్ని కనీసం జగన్ దృష్టికి తీసుకువెళ్లే ధైర్యమైనా చేయరు.  

రుషికొండ పనైపోయింది. ఇప్పుడిక    ఆ రుషికొండ బీచ్ ను కూడా పూర్తిగా ఒక ప్రైవేటు బీచ్ గా మార్చేసుకుంటున్నారు.  బీచ్ లోకి ఎంట్రీ ఫీజు నిర్ణయించారు. మంగళవారం నుంచి  ఆ ఫీజులు వసూలు చేయాలని కూడా నిర్ణయించేశారు.   విశాఖలో ఇప్పటివరకు ఇలా ఎక్కడా బీచ్‌లలో  ప్రవేశానికి టిక్కెట్లు పెట్టిన దాఖలాలు లేవు. ఆ పుణ్యం కట్టుకోవాలని జగన్ సర్కార్ గట్టిగా నిర్ణయించేసుకుంది.  రుషికొండను కేంద్ర ప్రభుత్వం ‘బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌’గా గుర్తించడంతో అక్కడ కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. వాటికి ఖర్చులు అవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి కేంద్రమే  భ్లూ ఫాగ్ బీచ్‌లకు నిధులు ఇస్తోంది. అయినా  రాష్ట్ర ప్రభుత్వం రుషికొండ బీచ్ కు ఎంట్రీ ఫీజు నిర్ణయించి దోపిడీకి తెరలేపిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ సందర్భంగా  రుషికొండ పై కట్టిన నివాసం నుంచి బీచ్ లోకి వెళ్లి సేదదీరేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేుకుంటున్నారని గతంలో అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.   ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం తారస్థాయికి చేరిందన్న సంగతిని గ్రహించిన ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలకు తెరలేపింది.  తూచ్ రిషికొండ బీచ్ లోకి ఎంట్రీ ఫీజ్ అంతా ఉత్తిదేనని మంత్రి అమర్నాథ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి చెప్పారు.  

నిజానికి మంగళవారం (జూలై 11) నుంచి రుషికొండ బీచ్ లోకి ఎంట్రీ ఫీజు అమలు చేయడానికి సర్వ సిద్ధమైపోయింది. ఎవరికీ తెలియకుండా అమలు చేసేద్దామని భావించారు.  కానీ అసలు విషయం ముందుగానే వెల్లడి అయిపోయిన నేపథ్యంలో  మంత్రి అమర్నాథ్ స్పందించి బీచ్ లో ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని, బీచ్ లో సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.  

By
en-us Political News

  
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.