ప్రతిపక్ష నేతగా రాహుల్ వైఫల్యం.. సీజేపీ చీఫ్ వైపు చూస్తున్న జనం.!

Publish Date:Sep 26, 2026

Advertisement

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ రూపంలో సవాల్ ఎదురౌతోంది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడంలో, నిలదీయడంలో విఫలమౌతున్నారన్న చర్చ గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో విస్తృతంగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో  సీజేపీ  చీఫ్ అభిజిత్ దిప్కే దూకుడు రాజకీయాలతో జాతీయ స్థాయిలో  మోడీ సర్కార్ ను నిలదీస్తున్నారు. కేంద్రం మెడలు వంచి ధర్మేంద్ర ప్రదాన్ చేత రాజీనామా చేయించగలిగారు. దీంతో  రాహుల్ గాంధీ చేయాల్సిన ప్రధాన పోరాటాలను సీజేపీ చీఫ్ తన చేతుల్లోకి తీసుకుంటూ, మంచి ఫలితాలు సాధించగలుగుతున్నారన్న అభిప్రాయం జనబాహుల్యంలో గట్టిగా వ్యక్తమౌతోంది. రాజీవ్ గాంధీ విఫలమైన చోట అభిజిత్ దిప్కే విజయాలు సాధిస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది,  

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్  వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా  క్రెడిట్ మొత్తం సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కే ఖాతాలో పడటాన్ని పరిశీలకులు ఉదాహరణగా చూపుతున్నారు. విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలకు నాయకత్వం వహించి ఆయన రాజీనామా చేయక తప్పని అనివార్యతను కల్పించడంలో  సీజేపీ ఉద్యమం సక్సెస్ అయ్యింది.

అలాగే తాజాగా ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుంటూ సీజేపీ ఉద్యమానికి ఉపక్రమించింది. ఆయన రాజీనామాకు డెడ్ లైన్ విధించింది. వాస్తవంగా ఈ స్థాయి దూకుడు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలో కనిపించాలి. అయితే ఆ దూకుడు సీజేపీ చీఫ్ కనబరుస్తున్నారు.  ఈవీఎంలు,  అవినీతి, ఎన్నికల నిర్వహణలో లోపాలపై వచ్చే నెల 2 నుంచి దేశ వ్యాప్తం ఆందోళనకు సీజేపీ పీలుపునిచ్చిన సంగతి విదితమే.  

ఈ ఆందోళన ప్రకటిస్తూ.. సీజేపీ చీఫ్.. ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు. ప్రస్తుత జాతీయ రాజకీయ శూన్యతను భర్తీ చేసేలా సీజేపీ ముందుకు సాగుతోందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో బలంగా వ్యక్తమౌతోంది. ఇక్కడే ప్రతిపక్ష నేతగా రాహుల్ వైఫల్యాలు మరింత ప్రస్ఫుటంగా తెరపైకి వస్తున్నాయి. 


[Rahul Gandhi, CJP Chief, Abhijeet Dipke, Election Commissioner, Opposition Leader, Indian Politics, Challange, Cacroch Janata Party]

By
en-us Political News

  
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు విద్య, విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఓ యాజమాన్యం అనుసరించిన సరికొత్త మార్గం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్, వ్యూయర్స్ సంపాదించాలనే పిచ్చి నేడు ఎంతోమంది యువతను తప్పుదారి పట్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.