పవన్ సవాల్.. ఉలుకూ పలుకూ లేని వైసీపీ!

Publish Date:Sep 15, 2023

Advertisement

పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలు కలిసే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రకటించడానికి ముందు వరకూ  వైసీపీ నేతలు టీడీపీ-జనసేన పొత్తులపై విపరీత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దమ్ముంటే జనసేన సింగిల్ గా పోటీ చేయాలని.. తెలుగుదేశం పార్టీకి జనసేన అమ్ముడుపోయిందని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని, ఆయన చంద్రబాబుకు దత్తపుత్రుడనీ వైసీపీ నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడారు.

తెలుగుదేశం గురించి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు గురించి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురించి కూడా మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేశారు. నీతి, నిజాయతీలు ఉంటే, దమ్మూ ధైర్యం ఉంటే తెలుగుదేశం , జనసేన పార్టీలు ఒంటరిగా పోటీ చేయాలని సవాళ్లు విసురుతూ వచ్చారు. లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారని.. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. అయితే, వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ వైసీపీకి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ సీఎం జగన్ మోహన్ రెడ్డికే  ఆయన దమ్మూ, ధైర్యం, నీతీ నిజాయితీలకు సవాల్ విసిరారు.

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసిన పవన్‌ కళ్యాణ్ ఆ వెంటనే  మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగానే పవన్‌ కళ్యాణ్‌ తెలుగుదేశంతో పొత్తుపై కీలక ప్రకటన  చేశారు. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని విస్పష్టంగా చెప్పారు. ఈ సమయంలో మీడియా నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. జనసేనకు దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని వైసీపీ నేతలు అంటున్నారన్న ప్రశ్నకు పవన్  వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానమిచ్చారు. తన పార్టీ ఎలా పోటీ చేయాలో వైసీపీ నేతలు చెప్పాలా.. లేక వాళ్లకి చెప్పి తాను తన పార్టీ  నిర్ణయాలు తీసుకోవాలా అని ప్రశ్నించారు. అసలు తన పార్టీ విధి విధానాల గురించి వాళ్లకెందుకని నిలదీశారు.

అక్కడితో ఆగకుండా, జగన్ కు దమ్మూ, ధైర్యం   రాజమండ్రి రూరల్ నుంచో లేదా గోదావరి జిల్లాల్లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచో పోటీ చేయాలని సవాల్ చేస్తున్నాననీ, ఆయన అలా పోటీ చేయడానికి సిద్ధ పడతారా అని ప్రశ్నించారు.  ఆ ఒక్క సావాల్ లో వైసీపీ నోళ్లు మూతపడిపోయాయి. ఇప్పటి వరకూ పవన్ సవాల్ కు బదులిచ్చిన వైసీపీ నేత లేరు. పవన్ సవాల్ తో వైసీపీ సైలెంట్ అయిపోవడంతో.. రాజకీయవర్గాలలో ఇప్పుడు ఏ కొత్త చర్చ మొదలైంది. నిజానికి పొత్తులు అనేది  రాజకీయ పార్టీల ఇష్టం. తమ భావజాలం, తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కలిసి వచ్చే వారితో ఎన్నికలలో పొత్తులు కూడగొట్టుకొని వెళ్లడం తప్పేమీ కాదు. అయితే.. ఇక్కడ వైసీపీ నేతలు కేవలం రెచ్చగొట్టడమే పనిగా దమ్ము, ధైర్యం అంటూ వ్యాఖ్యలు చేశారు.

పవన్ ఏకంగా జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాజమండ్రిరూరల్ లేదా గోదావరి జిల్లాల్లో ఏదో స్థానం నుంచి పోటీ చేయాలంటూ చేసిన సవాల్  వెనుక వైసీపీ నోరెత్తలేని బలమైన కారణం ఉంది.  దానిపైనే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదేమిటంటే.. ఇప్పటి వరకూ వైఎస్ జగన్ కుటుంబం రాయలసీమ, మరీ ముఖ్యంగా  ఉమ్మడి కడప జిల్లా  బయట  వచ్చి పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవు. 1978 నుంచి చూసుకుంటే కడప జిల్లా పులివెందుల నుంచి వైఎస్‌ జగన్‌ కుటుంబం పోటీ చేస్తుంది. పులివెందుల నుంచి 1978, 1983, 1985లో వైఎస్ రాజశేఖరరెడ్డి  విజయం సాధించారు. ఆ తరువాత 1989లో  ఆయన కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆయన సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1994లోనూ వివేకాయే విజయం సాధించారు.  మళ్ళీ 1999, 2004, 2009ల్లో వైఎస్  ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మృతి తర్వాత ఉప ఎన్నికలో విజయమ్మ విజయం సాధించారు. జగన్ కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పార్టీని ప్రారంభించిన తరువాత అదే నియోజకవర్గం నుంచి  విజయమ్మ మరోసారి విజయం సాధించారు.  ఇక 2014, 2019ల్లో  జగన్‌ ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహించారు. పులివెందుల దాటి బయటికి వస్తే వైఎస్ వివేకా కడప ఎంపీగా గెలవగా.. తొలిసారి 2014లో వైఎస్‌ విజయమ్మ కడప జిల్లా దాటి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తే లక్షకు పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు.

వైఎస్ సతీమణిగా.. వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ వారి సొంత జిల్లా దాటి బయట పోటీ చేసి గెలవలేకపోయారు. ఆ పరాజయంతో పోలిస్తే.. గత ఎన్నికలలో పవన్ రెండు చోట్లా ఓడిపోవడం, లోకేష్ మంగళగిరిలో  పరాజయం పాలు కావడం పెద్ద విషయమేమీ కాదు.   వైసీపీ నేతలు గురువిందల్లా పదే పదే  పదే పదే తాను రెండు చోట్లా పరాజయం పాలు కావడంపై ఇష్టారీతిన మాట్లాడుతుండటంతో పవన్ డైరెక్ట్ గా జగన్ నే కడప దాటి బయటకు రాగలవా, వచ్చి పోటీ చేసి గెలవగలవా? అని సవాల్ చేసినట్లు కనిపిస్తున్నది.  దీంతో సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డే గోదావరి జిల్లాలలో ఒక స్థానానికి పోటీ చేస్తే గెలుస్తారా అనే చర్చలు మొదలయ్యాయి. గోదావరి ప్రాంతం వైఎస్ ఫ్యామిలీకి అనువుగాని చోటు.. ఇలాంటి చోట జగన్ సర్వశక్తులు ఒడ్డినా గెలవడం సాధ్యమయ్యే పని కాదని తెలుసు కనుకనే వైసీపీ సైలెంట్ అయిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.