ఏపీలో రజనీకాంత్ ఎన్నికల ప్రచారం?

Publish Date:Sep 15, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ అస్పష్టంగా ఉన్న రాజకీయాలు ఇప్పుడు కొత్త కోణంలో స్పష్టమవుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. చంద్రబాబును జైల్లో కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకి వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి మరీ పొత్తులపై సంచలన ప్రకటన చేశారు. రానున్న ఎన్నికలలో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీరితో పాటు కమ్యూనిస్టులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దీంతో టీడీపీ-జనసేన కూటమికి ఇప్పుడు స్టార్ క్యాంపైనర్స్ పెరిగిపోయారు. ఇటు ఈ కూటమికి సినీ పరిశ్రమలో కూడా అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ దొరకడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటు నందమూరి, మెగా కుటుంబాల హీరోలు కూటమికి మద్దతుగా ఉండనున్నారు.

దీంతో పాటు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈసారి తెలుగుదేశం, జనసేన కూటమికి అండగా ఏపీలో ఎన్నికల ప్రచారం చేస్తారన్న ప్రచారం జోరందుకుంది.  నందమూరి కుటుంబంతో పాటు చంద్రబాబుతో రజనీకాంత్ కు మంచి స్నేహ సంబంధాలున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇటు మెగా కుటుంబంతో కూడా రజనీకాంత్ కు మంచి అనుబంధం ఉంది. మరోవైపు రజనీకాంత్ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. త్వరలోనే బీజేపీ రజినీని ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించనుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.  ఈ పరిణామాలన్నిటినీ పరిశీలిస్తే రజనీకాంత్ ఈసారి ఏపీలో ఎన్నికల ప్రచారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు గట్టిగా చెబుతున్నారు. ఒకవేళ బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమితో కలవకపోయినా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో ఉన్న సత్సంబంధాల కారణంగా వ్యక్తిగతంగా  రజనీకాంత్ ఏపీలో ఎన్నికల ప్రచారానికి మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నాయి. పరిస్థితులను నిశితంగా గమనిస్తే.. మునిగిపోయే పడవను వదిలేసినట్లుగా బీజేపీ కూడా  జగన్ పార్టీకి దూరం జరిగి తెలుగుదేశం, జనసేన కూటమిలో కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.  

దీంతో వచ్చే ఎన్నికలలో రజనీకాంత్ తెలుగుదేశం, జనసేన కూటమి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఖాయమేనని చెబుతున్నారు. రజనీకాంత్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని, ఆయన  ఎప్పుడూ తప్పు చేయరని, చేసిన అభివృద్ధి, సంక్షేమాలే ఆయనకు రక్ష. అవే ఆయనను బయటకు తీసుకవస్తాయి. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమి చేయలేవు  అంటూ లోకేష్‌కు ధైర్యం చెప్పారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా పంచుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆ మధ్య నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలకు హాజరైన రజనీకాంత్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు  విజన్ గురించి  వివరిస్తూ ఆయనపై   పొగడ్తల వర్షం కురిపించారు. ఆ పొగడ్తలలో రాజకీయ అంశాలేమీ లేకపోయినా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా  వైసీపీ నేతలు రజనీకాంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి ఒకింత ఆలస్యంగానైనా రజనీకాంత్ స్పందించి వైసీపీ నేతలపై చురకలు వేశారు.  

ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై కూడా రజనీకాంత్ స్వచ్ఛందంగా స్పందించారు. అరెస్టును ఖండించారు. ఈ పరిణాలన్నిటినీ చూస్తే వచ్చే ఎన్నికలలో విపక్ష కూటమికి రజనీ తనవంతు సహకారం అందిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి రజనీకాంత్  సొంత రాజకీయ పార్టీ పెట్టి ప్రజాసేవ చేయాలని భావించినా.. ఏవేవో కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో రాజకీయ రంగంలో తన మార్క్ చూపాలని భావించిన రజనీకాంత్ అది కుదరక పోవడంతో ఒకింత అసంతృప్తి ఆయనలో ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.  

ఈ నేపథ్యంలోనే  బీజేపీ ఆయనకు గవర్నర్ పదవిని ఆఫర్ చేసిందన్న ప్రచారం కూడా ఉంది.  అయితే దాని కంటే ముందు.. వచ్చే ఎన్నికలలో దక్షణాది రాష్ట్రాలలో ఆయన  ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని  రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సొంత రాష్ట్రం కర్ణాటక, ఆయన్ను సూపర్ స్టార్ ను చేసిన తమిళనాడు, తనను ఆదరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆయన పొలిటికల్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో కూడా రజనీ ఎన్నికల ప్రచారానికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు

By
en-us Political News

  
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.