జాతీయ స్థాయిలో మంటగలిసిన జగన్ ప్రతిష్ఠ!

Publish Date:Sep 20, 2024

Advertisement

వైసీపీ ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయాన్ని అందుకోవడాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికీ నమ్మడం లేదు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వైసీపీలోని కొందరు మినహా మెజారిటీ నేతలు వాస్తవాన్ని అంగీకరించారు. అతి కొద్ది మంది మాత్రం తెలుగుదేశం కూటమి విజయానికి ఈవీఎంల టాంపరింగే కారణమని ఆరోపణలు గుప్పిస్తున్నారు.   జూన్ 4, 2024న ప్రకటించిన ఫలితాలు, జగన్ ఐదేళ్ల పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన విస్పష్ట తీర్పు అనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇంతటి ఘోర ఓటమిని కలలో కూడా ఊహించని వైసీపీ క్యాడర్, నేతలు ఇంకా దిగ్భ్రాంతి నుంచి తేరుకోనే లేదు.  అయితే రోజులు గడుస్తున్న కొద్దీ వారికి వాస్తవం అవగతమవ్వడం మొదలైంది. జగన్ తీరు, వ్యవహారశైలి పార్టీ ఓటమికి కారణమన్న నిర్థారణకు వచ్చేసిన పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. 

అది వేరే సంగతి.. అసలే ఉనికి కసం నానా తిప్పలూ పడుతున్న వైసీపీని లడ్డూ ప్రసాదం వివాదం నిండా ముంచేసింది.  స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు అవశేషాలున్నాయని వెల్లడించడంతో ఎలాంటి సందేహాలకూ తావులేని విధంగా మెజారిటీ ప్రజలు విశ్వసించారు. అంతే కాదు... లడ్డూ ప్రసాదంలో కల్తి విషయం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.  జగన్ హయాంలో లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకానికి పడిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన మాట వాస్తవం. అన్న ప్రసాదం నాణ్యతపై భక్తులు చేసిన ఆందోళన తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లడ్డూ ప్రసాదం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలలో వాస్తవం ఉందనే జనం నమ్మారు. అందులో సందేహం లేదు. అందుకే వైసీపీ నేతలు మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల ఖండనలు, సవాళ్లను జనం పెద్దగా పట్టించుకోలేదు. 

సరిగ్గా ఇదే సమయంలో  లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనెయ్యి వార్తలను  నేషనల్ డెయిరీ డెవల ప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డిడిబి)  ల్యాబ్ రిపోర్ట్ బయటకు వచ్చింది.  దీంతో వైసీపీకి సమర్ధించుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది.  ఈ  ల్యాబ్ రిపోర్టును జాతీయ మీడియా కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించింది. ప్రసారం చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఇది విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి జంతు కొవ్వు అవశేషాలు ఉన్న నెయ్యిని వాడటంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన ఆచార్యుడు, అయోధ్య రామమందిర ప్రధానార్చుకుడు కూడా స్పందించి, ఇంతటి ఘోర అపచారానికి బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో విమర్వలు గుప్పించింది. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి భోభాకరంద్లాజే అయితే ఒక అడుగు ముందుకు వేసి.. కల్తీ నెయ్యే కాదు... తిరుమల కొండపై అన్యమత చిహ్నాల ఏర్పాటుకు జగన్ సర్కార్ ప్రయత్నిం చిందనీ, అలాగే పద్మావతి కళాశాల, టీటీడీ విద్యాలయాల్లో శ్రీవారి చిత్రపటాలను తొలగించే యత్నం కూడా చేసిందనీ ఆరోపించారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌ కు మరో వాయుగుండం పొంచి ఉంది.   ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన గురి చేసిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులకు  రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ నిర్ణయించారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో   ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావుపై  రెడ్ కార్నర్ నోటీసులు   జారీ చేయాలన్న హైదరాబాద్ పోలీసుల విజ్ణప్తికి సీబీఐ సానుకూలంగా స్పందించింది.
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది.
లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను ఆదేశించారు.
ముంబయి నటి కాదంబరీ జత్వానీని వేధించిన కేసులో  పోలీసులు తొలి అరెస్టు చేశారు. ఈ కేసులో కీలకమైన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌ను ఏపీ పోలీసులు ఈ రోజు (శుక్రవారం) డెహ్రాడూన్‌లో అరెస్టు చేశారు.
తన దగ్గర పనిచేసే డాన్సర్ మీద అత్యాచారం జరిపిన నేరం మీద పోలీసులు అరెస్టు చేసిన కొరియోగ్రాఫర్ జానీకి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది.
మాజీ మంత్రి విడదల రజనీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమె తమను భయపెట్టి, బెదిరించి, కోట్లాది రూపాయపలు వసూలు చేశారంటూ పల్నాడు జిల్లా, ఎడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈ మేరకు హోంమంత్రి అనితకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద వరలక్ష్మి అనే మహిళ పెట్టిన అత్యాచారం కేసును హైకోర్టు కొట్టేసింది.
అఫ్జల్ కు ఇటీవలె నిఖా( పెళ్లి) అయ్యింది.  చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ స్నేహితులతో అప్జల్ ప్రతీ రోజు ఇంటికి తప్ప తాగి వచ్చేవాడు. పెళ్లికూతురుకు ఇది నచ్చలేదు. వెంటనే తల్లిదండ్రులకు విషయం చేరవేసింది. కూతురు బాధను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు అదే బస్తీలో ప్రవచనాలు (తక్రీర్ ) ఇచ్చే మౌలానాను ఆశ్రయించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎవర్నీ రాజకీయంగా చెడగొట్టకపోయినప్పటికీ, చెడిపోయినవాళ్ళని మాత్రం చేరదీస్తున్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం హైకోర్టుకు చేరింది. లడ్డూ ప్రసాదం విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని  కోరుతూ సీనియర్ న్యాయవాది పోన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.